Gemini : 30 ఏళ్ల తర్వాత ఏలినాటి శని ప్రభావంతో మిథున రాశి వారికి జనవరి నెలలో జరగబోయేది ఇదే …! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gemini : 30 ఏళ్ల తర్వాత ఏలినాటి శని ప్రభావంతో మిథున రాశి వారికి జనవరి నెలలో జరగబోయేది ఇదే …!

 Authored By aruna | The Telugu News | Updated on :6 January 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Gemini : 30 ఏళ్ల తర్వాత ఏలినాటి శని ప్రభావంతో మిథున రాశి వారికి జనవరి నెలలో జరగబోయేది ఇదే ...!

Gemini  : 2024 సంవత్సరంలో జనవరి నెలలో మిథున రాశి వారి జీవితంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మిథున రాశి వారు బాల్యం నుంచి కష్టాలు, ఎత్తు పల్లాలు చూస్తారు. ఇతరుల అభిప్రాయానికి తగినట్లుగా ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. జీవితా అనుభవం అనేక రంగాల గురించి అవగాహన చిన్నతనం నుంచి అలవాటవుతుంది. జనవరి నెల నుంచి మిథున రాశి వారికి కెరియర్ పరంగా కొంత ఒత్తిడి ఉంటుంది. ఇక జనవరి నెలలో ఒక మార్పు లేదా స్వల్ప ప్రయాణం సూచించబడుతుంది. ఒక పనిపై దృష్టి సారించడం అనవసరమైన విషయాలలో కల్పించుకోక పోవడమే మంచిది. మిథున రాశి వారు భాగస్వామ్య వ్యాపారంతో అస్సలు వెళ్ళకూడదు. వ్యాపార విషయం పట్ల లావాదేవీల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే మోసపోయే అవకాశం ఉంటుంది. మిధున రాశి వారు ఎక్కువగా కష్టపడే తత్వం కలిగి ఉంటారు. ఆ కష్టమే మిథున రాశి వారిని ముందుకు తీసుకు వెళుతుంది. పైకి ఎదిగేలా చేస్తుంది. అంతే కాకుండా చేసే ప్రతి ఒక్క పని కూడా కష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకునేందుకు కూడా కీలకమైన పరిణామాలు కీలకమైన అంశాల్లో విశేషంగా రాణిస్తారు. ఎదుటి వాళ్లకు సహాయపడుతూ ఈ జీవితంలో ఎలాంటి నెగెటివిటీ లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని సాగిపోతూ ముందుకు వెళ్లాలి. అయితే నీతీ నిజాయితీలను వదలకుండా సంకల్ప బలంతో పనుల్లో ముందుకు సాగిపోతూ ఉంటే మిథున రాశి వారిని ఆపేవారు ఎవరు ఉండరు.

జీవితంలో ఎంతగానో ఉన్నత స్థితిలో నిలబెట్టుకున్న వారు అవుతారు. అయితే 2024 సంవత్సరం మిధున రాశి వారికి చాలా బాగుంది కానీ జనవరి నెలలో సాధారణమైన సమయాన్ని చూస్తారు. ఆ తర్వాత నుంచి జీవితంలో చాలా వరకు చాలా పరిణామాలు ఉన్నాయి. జీవితంలో ఉన్నత స్థితి సాధించేది కూడా 2024 లోనే. అంతేకాకుండా వివాహం కానీ వారికి వివాహం అవుతుంది. సంతాన ప్రాప్తి లేని వారికి ఈ సంవత్సరం సంతోషకరమైన సమయాన్ని ఆనందిస్తారు. దీంతోపాటుగా సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి. శివారాధన కూడా జీవితంలో క్రమం తప్పకుండా చేయాలి. కచ్చితంగా జీవితంలో ఎన్నో శుభ పరిణామాలు కలుగుతాయి. ఇష్ట దేవరాధన చేసిన కూడా మిథున రాశి వారికి విపరీతంగా కలిసి వస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది