Sagitarus Horoscope : ధనస్సు రాశి వారిపై నరదిష్టి ఎక్కువగా ఎందుకు ఉంటుంది…!
ప్రధానాంశాలు:
Sagitarus Horoscope : ధనస్సు రాశి వారిపై నరదిష్టి ఎక్కువగా ఎందుకు ఉంటుంది...!
Sagitarus Horoscope : మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ భాగంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది ఈ రాశి Horoscope కి అధిపతి గురువు. ధనుస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉంటుంది. అంతేకాదు నిష్కల్మషమైన మనసుతో కలకపటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటారు. ధనస్సు రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతే కాదండి ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు. ఏ విషయాన్ని అయినా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు. ధనస్సు రాశి Sagitarus వారికి ఆత్మగౌరవం స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి.
తమ అనుకున్న విషయాలను ఇతరులకు అవసరమైనంతవరకే తెలియజేస్తారు. ముఖ్యంగా తమ విషయాలలో ఇతరుల జోక్యాన్ని అస్సలు అంగీకరించరు. ఆధునిక విద్య ప్రత్యేక విద్యల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. సంఘంలో వీరికంటూ పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. అయితే ఈ విధంగా జీవితంలో ధనస్సు రాశి వారు ఎంతో సౌకర్యంగా ఉన్నతంగా బ్రతుకను చూసిన చుట్టూ ఉన్నవారు ఎక్కువగా నరదృష్టి వీరిపై ఉంటుంది. కాబట్టి నరదృష్టి ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుందో గ్రహించాలి అంటే. కొన్ని సూచనలు ఉంటాయి. తరచుగా వీరికి ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఏ పనిలోనూ మనసు లగ్నమై ఉండదు. కొత్త దుస్తులు ధరిస్తే వాటికి ఏదో ఒక విధంగా డామేజ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు వాటిపై కొన్ని మచ్చలు కూడా పడవచ్చు. ఇంట్లో సమస్యలు అడ్డంకులు దుఃఖం ఎడబాటు ఇంకా నష్టం అలాగే ఆస్తుల నష్టం ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య నిరంతరం వస్తూనే ఉంటుందండి.
ఇక భార్య భర్తల మధ్య లేనిపోని సమస్యలు అనుమానాలు బంధువులతో శత్రుత్వం శుభకార్యాలలో ఆటంకాలు ఒకరికొకరు వైద్య ఖర్చులు తినడానికి ఇష్టపడకపోవడం అందరితోనూ మండిపడడం చెడు కలలు నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలు ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాలుగా చెడు ఫలితాలు మీ చుట్టూనే ఉంటాయి. ఈ విషయంలో నరదృష్టి ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం.. అలాగే వీరి అదృష్టాన్ని చూసి కూడా అందరూ ఏడుస్తూ ఉంటారు అని చెప్పుకున్నాం కాబట్టి.. దీని నుంచి మరి మీరు ఎలా తప్పించుకోవాలి అని అంశానికి వస్తే కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. అవి పాటిస్తే మాత్రం ఖచ్చితంగా సమయంలో అంటే సూర్యోదయం అయిపోయిన తర్వాత అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత నన్ను అదృష్టం తీసివేయాలి. మంగళవారం కానీ లేదా ఆదివారం సాయంత్రం పూట తీసుకోవాలి. అమావాస్య రోజు అయితే మరీ మంచిది. నిమ్మకాయలతో కానీ ఇంకా టెంకాయతో గాని దిష్టి తీసుకోవడం వల్ల మీపై ఉన్నటువంటి నరదృష్టి మొత్తం అంతా కూడా తొలగిపోతుంది. ఇంకా చెప్పుకోవాలి అంటే గనక స్నానం చేసే నీళ్లలో ఉప్పును కలపండి. చిటికెడు ఉప్పు అంటే సాల్ట్ ను కాదండి కచ్చితంగా గళ్ళు మాత్రమే కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని ధనస్సు రాశి వారి స్నానం చేయడం వల్ల శరీర అలసటతో పాటు సోమరితనం కూడా తొలగిపోతుంది.