Vrischika Rashi 2024 : వృశ్చిక రాశి వారికి లైఫ్ సెటిల్ అవ్వడానికి సీక్రెట్ తెలిసింది…!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Vrischika Rashi 2024 : వృశ్చిక రాశి వారికి లైఫ్ సెటిల్ అవ్వడానికి సీక్రెట్ తెలిసింది…!!

Vrischika Rashi 2024 : వృశ్చిక రాశికి ఎనిమిదవది. ఈ వృశ్చిక రాశి వారి స్వభావ పద్యాన్ని కలిగి ఉంటారు. అంటే వీరు జీవితంలో ఎప్పుడు కూడా పై చేయి సాధించాలి అనుకుంటారు. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి ముందు చూపు చాలా ఎక్కువ. మరీ ముఖ్యంగా ముసుగులోగుద్దులాట అనేది వీరికి నచ్చని పని. ఏదైనా సరే ముఖం మీద తేల్చుకుంటారు. ఆలోచనలను కూడా చాలా తేలికగా పసిగట్టేస్తూ ఉంటారు. తమ సామర్థ్యంతో ఎదుటి వాళ్ళని […]

 Authored By aruna | The Telugu News | Updated on :7 February 2024,9:00 am

Vrischika Rashi 2024 : వృశ్చిక రాశికి ఎనిమిదవది. ఈ వృశ్చిక రాశి వారి స్వభావ పద్యాన్ని కలిగి ఉంటారు. అంటే వీరు జీవితంలో ఎప్పుడు కూడా పై చేయి సాధించాలి అనుకుంటారు. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి ముందు చూపు చాలా ఎక్కువ. మరీ ముఖ్యంగా ముసుగులోగుద్దులాట అనేది వీరికి నచ్చని పని. ఏదైనా సరే ముఖం మీద తేల్చుకుంటారు. ఆలోచనలను కూడా చాలా తేలికగా పసిగట్టేస్తూ ఉంటారు. తమ సామర్థ్యంతో ఎదుటి వాళ్ళని ఎవరినైనా సరే కానివ్వండి తమ నియంత్రణ లోకి తెచ్చుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. వీరికి ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాలతో అత్యద్భుతమైన నాయకులుగా నిరూపించుకోవడం జరుగుతుంది. ఇక వీరికి వాక్చాతుర్యం కూడా ఎక్కువే చాలా ధైర్యంగా ముందుకు సాగిపోతారు. ఎవరినైనా తమ మాటలతో చాలా తేలికగా నియంత్రణలోకి తెచ్చుకుంటారు. పుట్టుకతోనే వీళ్ళకి నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వృశ్చిక రాశి వారిని కంట్రోల్ చేయడం మాత్రం అంత తేలికైన విషయం కాదు. మొండి పట్టుదలతో పంతంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అనుకున్నది నెరవేర్చే వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే వారు కాదు.

ఖచ్చితంగా ప్రత్యర్థులు ఎంతటి గొప్పవాళ్ళైనా కానివ్వండి. వాళ్ళుని ఎదుర్కోవాల్సి వస్తే చాలావరకు ఆలోచిస్తూ ఉంటారు. వీరి యొక్క ఆత్మవిశ్వాసానికి ప్రత్యర్ధులు కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. ఈ రాశి వారు నిజంగా లీడర్స్ అని చెప్పుకుంటారు. ధైర్యం తెగింపులో వీరికి సాటి లేదు. అయితే ఇంతటి అద్భుతమైనటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వృశ్చిక రాశి వారి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశి వారిది జల స్వభావం అయినందువల్ల బయటపడకుండా ఏదీ కూడా బయటకు రాకుండా పనుల్ని వీళ్ళే చక్క పెట్టుకోవడం జరుగుతుంది. అటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు చాలా రహస్యంగా తమ వ్యవహారాలను చక్కబెట్టుకుంటూ ఉంటారు. ఏమి జరిగిపోయినవి ఏమి జరగాల్సినవి అనే ఒక స్పష్టమైన ఆలోచనతో ప్రాక్టికల్ గా ముందుకు వెళుతూ ఉంటారు. అయితే వృశ్చిక రాశి వారి గురించి ప్రత్యర్థులు అయితే కచ్చితంగా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అంటేనే తేలు అంటే దాని యొక్క గుణాలు కూడా వీరు కలిగి ఉంటారు.

ఈ రాశి వారిని ఎవరైనా పొరపాటున బాధ పెట్టాలని ప్రయత్నిస్తే దానిని గుర్తు పెట్టుకొని మరి సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కనుక ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆకర్షించుకోవాలి. అలాగే ఆలోచించుకోవాలి. ఈ మార్పులు మీ జీవితాన్ని చేసే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు చేసుకోవలసిందిగా ఒక్కటే ఒకటికి రెండుసార్లు ఏదైనా ఒక నిర్ణయం పట్ల ఆలోచన చేసి పూర్తి అవగాహనతో మాత్రమే ఆ విషయంలో ముందుకు వెళ్లాలి. ఇక వృశ్చిక రాశి వారి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలి అంటే ఈ సమయంలో మీరు కొన్ని పరిహారాలు చేస్తే సరిపోతుందండి. అయితే ఆ పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అంటే కచ్చితంగా శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజుల్లో మీరు సోమవారాల్లో శివరాధన చేయండి. వీలైనప్పుడల్లా మీ నుదిటిపై కుంకుమ తిలకం రాయండి. అంతేకాకుండా మీరు ఏదైనా ముఖ్యమైన పని వ్యాపార లావాదేవీలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నప్పుడు లేదంటే వీటి పని మీద మీరు బయటకు వెళ్తున్నప్పుడు మీ నుదుటిమీద ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్ళండి. ఈ విధంగా వెళ్లిన కూడా మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితం కూడా సెటిల్ అవుతుంది…

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక