Home » Devotional » Pisces Is Lucky For Them In New Year
Devotional

Zodiac sign : కొత్త ఏడాదిలో ఈ రాశుల‌ వారికి లక్కు చిక్కినట్టే..!

Authored By
mallesh
The Telugu News | Published on: December 30, 2021, 6:15 am
Advertisement

Zodiac sign : మరో రెండ్రోజుల్లో ప్రపంచం 2022 కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనుంది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా చాలా మంది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఒత్తిడితో నలిగిపోయారు. 2020,2021 ప్రపంచ వ్యాప్తంగా అంధకారాన్ని నింపింది. ఇప్పుడిప్పుడే ఆ అంధకారం దూరమవుతున్న తరుణంలో మరోసారి ఒమిక్రాన్ పేర మరో పెనుప్రమాదం దూసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్ వరల్డ్ వైడ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మనదేశంలో దీని ప్రభావం కాస్త తక్కువే అయినప్పటికీ తెలికగా తీసుకోవద్దని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది అయినా తాము అనుకున్న పనులు జరుగుతాయా? లేదా ప్రస్తుత ఇబ్బందులే భవిష్యత్ లోనూ పునరావృతం అవుతాయా అని చాలా మంది ఆందోళనల మధ్య ఉన్నారు.

Advertisement

జాతకచక్రం ప్రకారం మీనరాశి రాశికి కొత్త ఏడాదిలో ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..మీనరాశి వారికి కొత్త ఏడాదిలో అంతా శుభమే కలుగుతుందని రాశి ఫలాలు గోచరిస్తున్నాయి. 2022 ఏప్రిల్ తర్వాత ఈ రాశి వారిలో శని తొలగిపోయి గురుబలం పెరగనుంది. పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం ప్రకారం.. మీనరాశి వారు ఆర్థికంగా సంపన్నంగా ఉంటారు. ఏప్రిల్‌లో శని పదకొండవ పాదం నుంచి 12 ఇంటి వెళ్తాడు. దీంతో కొత్త ఆదాయ మార్గాలు కలుగుతాయి. ఆగస్ట్, అక్టోబర్ నెలల మధ్య గ్రహాలు నిరంతరం స్థానచలనం పొందుతుండటంతో కొంత ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ పరంగా ఆశించిన ఫలితాలు పొందుతారు.

pisces is lucky for them in new year

Advertisement

Zodiac sign : లక్కు చిక్కినట్టే.. ఆ నాలుగు నెలల వరకు..

విద్యార్థులు చదువులో రాణిస్తున్నారు. ఉద్యోగులు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వంటి పొందుతారు. ఏప్రిల్ చివరి వారంలో కుటుంబంలో కొంత గొడవలు జరగొచ్చు.మే, సెప్టెంబర్ నెలల్లో కుటుంబసభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించండి. అవివాహితులకు, పెళ్లయిన వారు తమ భాగస్వాములతో సంతోషంగా జీవనం సాగిస్తారు. 21 ఏప్రిల్ తర్వాత పెళ్లి చేసుకునే జంటలకు అంతా మంచే జరుగుతుంది. వచ్చే ఏడాది ప్రేమ జంటలకు కూడా మంచి జరుగుతుంది. పెద్దల సమ్మతితో పెళ్లి జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రమాదాలు, అనారోగ్యం, చికాకు, ఆర్థిక ఇబ్బందులు తొలగి అంతా మంచే జరగాలనుకుంటే మీనరాశి వారు సూర్య దేవుడిని ఆరాధించండి. పశు, పక్ష్యాదులకు ఆహారం, నీరు అందిస్తే శుభం కలుగుతుంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి