Scorpio Horoscope : 2024 మార్చి నెలలో వృశ్చిక రాశి వారి నుదుటిన రాత ప్రకారం 100% జరిగేది ఇదే…!
ప్రధానాంశాలు:
Scorpio Horoscope : 2024 మార్చి నెలలో వృశ్చిక రాశి వారి నుదుటిన రాత ప్రకారం 100% జరిగేది ఇదే...!
Scorpio Horoscope : వృశ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగో పాదం. అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు. జేష్ట ఒకటి రెండు మూడు నాలుగు కింద జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి కిందికి వస్తారు. ఈ రాశి వారికి మార్చి 2024 లో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ అనవసర ఖర్చులు అదుపుతప్పుతాయి. గతంలో ఈ రాశి వారి నుంచి సహాయం పొందిన వారు ప్రయోజనం పొందని వారు అవసర సమయంలో మీద వేసుకొని ఆర్థికంగా నష్టపోతారు. కొందరు స్నేహితులు మీ బలహీనతలను అవకాశంగా తీసుకొని సమస్యలు సృష్టిస్తారు. ఎదుటివారిని గుడ్డిగా నమ్మడం వారికి ఆర్థిక బాధ్యతలు అప్పగించడం కాదు మొదటి వారంలో అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. కొన్ని సమస్యలు వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్య నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సలహాలను పాటిస్తారు. వ్యాపారాలు పుచ్చుకొని లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నత స్థాయి తథ్యం. కళాకారుల యత్నాలు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం.
చాలా మంచి ఆదాయాన్ని చూస్తారు. మీ వ్యాపార భాగస్వామికి మీతో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీ భాగస్వామితో వ్యవహరించేటప్పుడు ఓపిగ్గా ఉండడానికి ప్రయత్నించండి. విద్యార్థులు కోరుకున్న విద్యాసంస్థల ప్రవేశం పొందడంతో పాటు విదేశాల్లో ప్రవేశానికి ప్రయత్నిస్తున్న వారికి వారి ప్రవేశానికి సంబంధించి శుభవార్త లభిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఉద్యోగాలలో హోదాను సాధిస్తారు. ఆధ్యాత్మికపరంగా ఉన్నత స్థాయి వ్యక్తుల దర్శన భాగ్యం పొందగలుగుతారు.
ఉద్యోగ జీవనంలో మీ శ్రమకు తగిన గుర్తింపు గౌరవ సత్కారాలు పొందగలుగుతారు. ఉద్యోగాల్లో మేలైన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. కీలక విషయాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. సమయాన్ని వృధా చేయకండి. శత్రువులకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు ముందుచూపు అవసరం. గ్రహబలం అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఉద్యోగ వ్యాపారాధన ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అనుకూలమైన సమయం వివిధ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. విందు వినోదం కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానుకోవద్దు. మీరు చేయవలసిన పరిహారాలు ఏంటంటే శుక్రవారం నాడు నీటిలో ఎర్రచందనం కలిపి స్నానం చేయాలి. దీని తర్వాత లక్ష్మీదేవికి ఎరుపు చీరలు సమర్పించి ఆపై లక్ష్మి స్తోత్రం పటించండి. ఈ పరిహారం సంపద శ్రేయస్సును పెంచుతుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం…