Zodiac Signs : దీపావళి తర్వాత శని మహాదశ…ఈ రాశుల వారి పంట పండినట్లే..!!

Authored By aruna | The Telugu News | Published on: October 23, 2024, 7:00 am

Zodiac Signs : శనీశ్వరుడు కర్మ ఫలదాత. అలాగే న్యాయ దేవత. శని దేవుడు మనుషుల కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అందుకే చాలామంది శని అంటే భయపడుతూ ఉంటారు. శని చెడు పలితాలతో పాటు మంచి ఫలితాలను కూడా ఇస్తాడు. ఈ నేపథ్యంలోనే శని వచ్చే నెల 15వ తేదీ నుండి సంచార దశలో ఉంటాడు. దీని వలన కొన్ని రాశుల వారి జీవితంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. అయితే ఈ ఏడాది దీపావళి పండగను ఈ నెల 31వ తేదీన ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున శని దేవుడి మహాదశ ఉండడం వలన కొన్ని రాశుల వారికి భారీ ప్రయోజనాలు కలగబోతున్నాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

వృశ్చిక రాశి.

శని మహాదశ కారణంగా వృశ్చిక రాశి వారు పిల్లల నుండి శుభవార్తలను వింటారు. అలాగే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి లాభాలు ఉంటాయి. వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు విస్తరించడం వలన మంచి లాభాలను పొందుతారు. వృశ్చిక రాశి జాతకుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే వారి పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది.

మకర రాశి.

మకర రాశి వారికి శని దేవుని అనుగ్రహం కారణంగా వీరు భారీ లాభాలను పొందుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. విద్యార్థులు పోటి పరీక్షలలో రానిస్తారు. అలాగే మకర రాశి వారు ఈ సమయంలో విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇక కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరిగి సంతోషంగా ఉంటారు.

Zodiac Signs : దీపావళి తర్వాత శని మహాదశ…ఈ రాశుల వారి పంట పండినట్లే..!!

కర్కాటక రాశి.

కర్కాటక రాశి వారికి శని మహాదశ కారణంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ సమయంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే వీరి పెద్దల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. కర్కాటక రాశి వారికి అదృష్టం తోడవడంతో చేసే పనులలో విజయం సాధిస్తారు.

కుంభరాశి.

కుంభ రాశి వారు దీపావళి పండుగ తర్వాత ఏ పని మొదలుపెట్టిన అందులో విజయం సాధిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. అలాగే కుంభ రాశి వారికి శని దశ వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. అదేవిధంగా ఉద్యోగం మారాలి అనుకునే వారికి మరొక ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp