
today horoscope in telugu
మేషరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. కుటుంబంలో చర్చలు, వాదాలు జరుగుతాయి. అనుకోని దూరప్రయాణాలు. ప్రయాణ సమయంలో విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు చేస్తున్న వారికి చికాకులు, ఆఫీస్‌లో చిన్న సమస్యలు రావచ్చు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో మీకు పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ, ఆఫీస్ వ్యవహారాలలో జయం. పెద్దల సలహాలు పాటిస్తారు. వ్యాపారులకు లాభాలు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు ఈ రోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ చండీదేవి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : ఈరోజు బద్దకంగా ఉంటుంది. ఆఫీస్‌లో పనులు మందగమనంలో నడుస్తాయి. ఆర్థికంగా అంత మంచి రోజు కాదు. కుటుంబంలో సామరస్యత తగ్గుతుంది. అనుకోని ప్రయాణాలు. చేసే పనులు కలసిరావు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం రాదు. శ్రీలలితా దేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు చాలా ఆనందంగా గడుపుతారు. అనుకోని ధనలాభాలను పొందుతారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వినే అవకాశం కలదు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆఫీస్‌లో మీ ప్రతిభను నిరూపించుకుంటారు. వ్యాపారంలోఒత్తిడులు తొలగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు మంచి ఫలితాలు వస్తాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.
today horoscope in telugu
సింహరాశి ఫలాలు : ఈరోజు చేసే పనులలో ఆటంకాలు. చేసే పనులు నెమ్మదిస్తాయి. ఆఫీస్‌లో పై అధికారుల నుంచి వత్తిడి వస్తుంది. అనుకోని ప్రయాణాలు, ఖర్చులు రావచ్చు. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకోని ఫలితాలు వస్తాయి. శ్రీదుర్గా స్తోత్రం పారాయణం చేయండి.
కన్యరాశి ఫలాలు : ఈరోజు శుభవార్త శ్రవణం. అనుకోని వారి నుంచి మంచి వార్తలు వింటారు. కుటుంబంలో కీలక నిర్ణయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా ఉంటారు. అనుకోని వారి నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుంచి వివాదాలు పరిష్కారం. ఆకస్మిక ధన లాభాలు. వ్యాపారాలలో ప్రగతి కనిపిస్తుంది. శ్రీరాజరాజేశ్వరి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. చేసే పనులు నెమ్మదిస్తాయి. కుటుంబంలో వివాదాలకు ఆస్కారం ఉంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ధనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు. రుణాలు చేస్తారు. వ్యాపారాలలో చికాకులు. విద్యార్థులకు మంచి సమయం. శ్రీశివాభిషేకం చేయించండి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఇబ్బందులకు గురవుతారు. అనవసర ఖర్చులు వస్తాయి. కుటుంబంలో పెద్దల మాటలను వినకపోవడం వల్ల ఇబ్బందులు. మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఫలితాలు నిరాశ పరుస్తాయి. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు అనుకోని సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు శుభ ఫలితాలు వస్తాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఒత్తిడుల నుంచి బయటపడుతారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు సంతోషకరమైన రోజు. ఉత్సాహంగా పని చేస్తారు. కుటుంబంలో అనందంగా ఉంటుంది. పెద్దల సలహాలు తీసుకుని ముందుకుపోతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. వివాదాలు పరిష్కారం. వ్యాపారులకు అనుకూల పరిస్థితులు. శ్రీ రామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు వివాదాలకు ఆస్కారం ఉంది. కుటుంబంలో అనుకోని వివాదాలకు ఆస్కారం ఉంది. అనుకోని ప్రయాణాలు. ఆఫీస్‌లో తగాదాలకు అవకాశం ఉంది. విద్యార్థులు చదువు వాయిదా వేస్తారు. వ్యాపారాలకు జాగ్రత్త అవసరం. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.