Today Horoscope : నవంబర్ 30 మంగళవారం ఈ 3 రాశుల వారికి అప్పుల బాధలు తీరుతాయి ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Horoscope : నవంబర్ 30 మంగళవారం ఈ 3 రాశుల వారికి అప్పుల బాధలు తీరుతాయి !

మేషరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఇబ్బందులు. ఇంటా, బయటా అనుకోని సమస్యలు రావచ్చు జాగ్రత్త. కార్యాలయాలలో అనుకోని పనివత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు, నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు చికాకులను కలిగిస్తాయి. ఆర్థిక మందగమనంలో రోజు గడుస్తుంది. శుభ ఫలితాల కోసం శ్రీలక్ష్మీ, దుర్గాదేవతలను ఆరాధించండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు అలసట, ప్రయాణ బాధలు ఉంటాయి. ఆర్థికంగా సాధారణమైన రోజు. వ్యాపారాలు ముందుకు సాగవు. కుటుంబ సభ్యులతో వివాదాలు రావచ్చు. వ్యయప్రయాసలు. పనులు మందగిస్తాయి. గోసేవ చేయండి […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 November 2021,10:00 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఇబ్బందులు. ఇంటా, బయటా అనుకోని సమస్యలు రావచ్చు జాగ్రత్త. కార్యాలయాలలో అనుకోని పనివత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు, నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు చికాకులను కలిగిస్తాయి. ఆర్థిక మందగమనంలో రోజు గడుస్తుంది. శుభ ఫలితాల కోసం శ్రీలక్ష్మీ, దుర్గాదేవతలను ఆరాధించండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు అలసట, ప్రయాణ బాధలు ఉంటాయి. ఆర్థికంగా సాధారణమైన రోజు. వ్యాపారాలు ముందుకు సాగవు. కుటుంబ సభ్యులతో వివాదాలు రావచ్చు.
వ్యయప్రయాసలు. పనులు మందగిస్తాయి. గోసేవ చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

మిధునరాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహకరంగా ఉంటుంది. అనుకోని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కుటుంబంలో, సమాజంలో గౌరవం. ధనలాభం, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు ఆటంకాలతో పనులు ముందుకు రావు. ఆర్థిక మందగమనం. కుటుంబ సభ్యులకు అనారోగ్యం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. శత్రువుల బాధలు పెరుగుతాయి. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. శ్రీలక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి.

today horoscope in telugu

today horoscope in telugu

సింహరాశి ఫలాలు : ఈరోజు సంతోషకరమైన వార్తలు వింటారు. వ్యాపారులకు, ఉద్యోగులకు కొంత కాలంగా ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కారం అవుతాయి.రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులకు మంచిరోజు.సమాజంలో మీకు పేరు ప్రతిష్ఠలు. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. అనుకూలమైన ఫలితాల కోసం నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

కన్యారాశి ఫలాలు : ఈరోజు స్వల్ప సమస్యలతో సాగుతుంది. మీ తెలివి తేటలతో, ఓర్పుతో వాటిని అధిగమిస్తారు. కార్యాలయాలలో శ్రమ అధికంగా ఉంటుంది. చిల్లర,టోకు వ్యాపారులకు మంచిగా ఉంటుంది. పాల వ్యాపారులు, కిరాణం వారికి మంచిరోజు.దూరప్రయాణాలు. బంధువులతో ఇబ్బందులు. శ్రీ చండీ ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు, ఇంటా, బయటా పనులను సంతోషంగా వేగంగా పూర్తిచేస్తారు,. ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడుపుతారు. పాత మిత్రుల కలయిక. విందువినోదాలలో పాల్గొంటారు. నవగ్రహా స్తోత్రం పారాయణం చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు విజయం లభిస్తుంది,. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో ముఖ్య విషయాలను చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు పురోభివృద్ధి బాటలో పయనిస్తాయి. శివుడికి తుమ్మిపూలతో ఆరాధన చేయండి,.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు ధన సంబంధ విషయాలలో జాగ్రత్తలు అవసరం. అనుకోని ఖర్చులు రావచ్చు. కొత్త ప్రాజెక్టులకు దూరంగా ఉండాల్సిన రోజు. మిత్రులతో విభేదాలు. అనారోగ్య సూచన. శుభ ఫలితాల కోసం శ్రీహనుమాన్‌ చాలీసా పారాయణ చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. పనులు నెమ్మదిగా పూర్తిచేస్తారు. అనుకోని అతిథుల రాకతో బిజీగా గడుస్తుంది. పనులలో విఘ్నాలు వస్తాయి. కొత్త వస్తువుల కొనుగోలకు ప్రయత్నాలు చేస్తారు. అప్పులు చేసే అవకాశం ఉంది, మానసిక ప్రశాంతత ఉండదు. వివాహం అయినవారికి భార్య తరపు వారి నుంచి లాభాలు కలుగుతాయి. శ్రీఆంజనేయస్వామి ఆలయ దర్శనం చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు ముఖ్యమైన వార్తలు వింటారు. అవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి.
పనులలో విజయం. శుభవార్తా శ్రవణం. కొత్త వాహనాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉమ్మడి వ్యాపార ఒప్పందాలు. శ్రీశివరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు శుభవార్త శ్రవణం. బంధువుల నుంచి కొత్త ప్రపోజల్స్‌ వింటారు. స్నేహితులతో విహార యాత్రలకు ప్లాన్‌ చేస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
ధన సంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పుల బాధలు తీరుతాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది