Zodiac Signs : ఏప్రిల్‌ 18 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : ఏప్రిల్‌ 18 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By prabhas | The Telugu News | Updated on :17 April 2022,10:40 pm

మేషరాశి ఫలాలు : ఆనందయోగం. చక్కటి శుభ ఫలితాలు. అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. ధన లాభాలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శ్రీ సోమేశ్వరస్వామి ఆరాధన చేయండి.వృషభరాశి ఫలాలు : మీరు చేసే పనులు ఎట్టకేలకు పూర్తిచేస్తారు. అనుకున్నంత ఆదాయం లేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. చికాకులు తగ్గుతాయి. శ్రీ శివాభిషేకం చేయించండి.

మిధునరాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు. ఆస్థి విషయంలో మీరు ఊహించని మార్పులు. ఆదాయానికి మించిన ఖర్చులు. చికాకులు ఉనాన మీరు పట్టుదలతో ముందుకుపోతారు. మహిళలకు ధన లాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆష్టోతరం చదువుకోండి మంచి ఫలితం వస్తుంది. కర్కాటకరాశి ; మీరు చేసే పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. పాత బకాయీలు, బాకీలు వసూలు అవుతాయి. ఊహించని చోట నుంచి శుభవార్త వింటారు. పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. శ్రీ మల్లికార్జునస్వామి ఆరాధన చేయండి.

Today Horoscope april 18 2022 check your zodiac signs

Today Horoscope april 18 2022 check your zodiac signs

సింహరాశి : అనుకోని సమస్యలు వస్తాయి కానీ మీరు ధైర్యంగా వాటిని ఎదురించి ముందుకుపోతారు. మనస్సు ప్రశాంతత కోల్పోతారు. పని భారం పెరుగుతుంది. ఆదాయం సాధారణంగా ఉంటుంది. అనుకోని మార్పులు. శ్రీ శివకవచం చదువుకోండి మంచి శుభ ఫలితాలు వస్తాయి.

కన్యారాశి ఫలాలు : సంతోషంగా గడుపుతారు. అప్పుల తీరుస్తారు,. రియల్‌, ఫార్మ, మెడికల్‌ వ్యాపారులకు మంచి రోజు. దూరపు బంధువుల నుంచి శుభవార్త వింటారు. సమాజ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. బంధువుల నుంచి ఇబ్బందులు. ఆదాయం తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఇంటా, బయటా కొంత ఇబ్బందికర పరిస్థితి. ప్రయాణాల వల్ల ఇబ్బంది. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : అప్పులు తీరుస్తారు. కుటుంబంలో శుభకార్యలు చేయాలని భావిస్తారు. అనుకోని మార్గాల ద్వారా లాభాలు వస్తాయి. ధనలాభాలు. విలువైన వస్తువుల, గృహోపకరణాలు కొంటారు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : మంచి వాతావరణం. అనుకున్న సమాయానికి అన్ని పనులు పూర్తిచేస్తారు. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి. అన్ని రకాల వృత్తుల వారికి సానుకూలమైన ఫలితాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మకరరాశి ఫలాలు : కుటుంబంలో అనుకోని మార్పులు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఆనారోగ్య సూచన. అనవసర ఖర్చులు. ఆదాయానికి మించి ఖర్చులు. వివాదాలకు దూరంగా ఉండండి శివపూజ, శివార్చన మంచి పలితాన్నిస్తుంది.

కుంభరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. మహిళల ద్వారా లాభాలు. కొంచెం శ్రమిస్తే మంచి ఫలితాలు వస్తాయి. పనులు సమయానికి పూర్తిచేయలేక పోతారు. ఆదాయం తగ్గుతుంది. మిత్రుల ద్వారా కొంత ప్రయోజనాలు పొందుతారు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు వస్తాయి. మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం వస్తుంది. అప్పులు తీరుస్తారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది