Zodiac Signs : ఆగస్టు 14 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే .?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 13 August 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు కుటుంబానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్తిక విషయాలలో ఇబ్బందులు. ఆధ్యాత్మిక ఆలోచనలు. ఆస్తి సంబంధ విషయాలలో పెద్దల సలహాలు పాటించండి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు ఆనుకోని పరిస్థితులు ఏర్పడుతాయి. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు వస్తాయి. వివాదాలకు అవకాశం ఉంది. మీరు చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. అప్పుల కోసం ప్రయత్నించండి. ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయి. శ్రీ కాలభైరావారాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : ఆర్థిక పరిస్థితిలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో చికాకులు తగ్గుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. అనారోగ్యం నుంచి బయటపడుతారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొత్త విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. ప్రయాణ సూచన. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు ధనలాభాలు. శ్రీ లక్ష్మీ నారయణ స్వామి ఆరాధన చేయండి.

Today Horoscope August 14 2022 Check Your Zodiac Signs

Today Horoscope August 14 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : వ్యాపారాలలో లాభాల వస్తాయి. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. బంధువుల కలయిక. విందువినోదాలలో పాల్గొంటారుజ. ప్రేమికుల మధ్య చర్చలు సఫలం. కోర్టు, ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : చికాకులు వస్తాయి కానీ ధైర్యంతో ఓపికతో ముందుకు పోతారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. వివాహ విషయాలలో ప్రయత్నాలు సఫలం అవుతాయి. రుణ ప్రయత్నాలు సఫలం అగుతాయి. మీరు చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. శ్రీ అమ్మవారి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : అన్ని వ్యవహారాలలో ఇబ్బందులు వస్తాయి. కానీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. పెద్దల నుంచి సలహాలు లభిస్తాయి. ఇంటా, బయటా బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి. ఆర్థిక సమస్యలు. ఆధ్యాత్మిక ఆలోచనలు సందర్శిస్తారు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : మంచి ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అనుకోని ప్రయాణ సూచన. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. ఆశించిన మేర ఫలితాలు ఉండకున్నా పర్వాలేదు అనిపిస్తుంది ఈరోజు. అన్ని రకాల వ్యవహారాలు మామూలుగా నడుస్తాయి. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఇంట్లో శుభకార్య యోచన చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు వస్తాయి,. విలువైన వస్తువులు కొంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : కొద్దిగా కష్టపడాల్సిన రోజు. ఆర్థికంగా మందగమనం. విద్యా, వివాహ ప్రయత్నాలు సఫలం కావు. మహిళలకు శ్రమ భారం పెరుగుతుంది. కుటుంబంసభ్యులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణబాధలు. పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

కుంభరాశి ఫలాలు ; వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారులకు లాభాలు వస్తాయి. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. మిత్రుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో స్వల్ప మార్పులు జరుగుతాయి. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

మీన రాశి ఫలాలు : అన్ని విషయాలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. అప్పులు చేస్తారు. ఆదాయం తగ్గుతుంది. అన్నదమ్ముల నుంచి వత్తిడి. అనారోగ్య సూచన. అనారోగ్య సూచన. విద్యా, ఉద్యోగ విషయాలలో చికాకులు వస్తాయి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  2. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  3. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  4. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  5. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  6. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

  7. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి