Vidura Niti : విదురుడు చెప్పిన ఈ నియమాలను పాటిస్తే చాలు… ఇక మీకు తిరుగు ఉండదు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vidura Niti : విదురుడు చెప్పిన ఈ నియమాలను పాటిస్తే చాలు… ఇక మీకు తిరుగు ఉండదు…

 Authored By aruna | The Telugu News | Updated on :12 August 2022,6:00 am

Vidura Niti : మహాభారతంలో ధృతరాష్ట్రుడి సవతి కొడుకే విదురుడు. ఈయన గొప్ప జ్ఞాని. దూర దృష్టి కలిగిన వ్యక్తి. దాని కారణంగానే కొన్ని సమస్యలను ముందుగానే ఊహించేవాడు. కురుక్షేత్ర యుద్ధం కూడా చాలా ఘోరంగా ఉంటుందని ధృతరాష్ట్రుడిని హెచ్చరించాడు. విదురుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయంలో ముఖ్యపాత్ర పోషించిన శ్రీకృష్ణుడితో పాటు విదురుడి సలహాలు కూడా ఉన్నాయి. పాండవులు విదురుడి మాటలకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. భీష్ముడు కూడా విదురుడి సలహాలను తీసుకునేవాడు. అయితే విదురుడు ప్రజలకు సహాయం చేయడం గురించి కొన్ని ప్రత్యేక విషయాలను కూడా చెప్పాడు. అవేంటో ఇప్పుడు శిశువుతెలుసుకుందాం.

విదురుడు చెప్పిన దాని ప్రకారం మీ సంతానంకు కానీ మీరు ఇష్టపడే వ్యక్తుల క్షేమ కోరుకుంటున్నారో వారికి మంచి తో పాటు చెడు గురించి కూడా హెచ్చరించాలని విదురుడు తెలిపారు. ఇలాంటి విషయాలు చెప్పడంలో ఆలస్యం చేయకూడదని, వారు అడిగే వరకు వేచి ఉండకూడదు అని, చెడు గురించి హెచ్చరించాలి అని విదురుడు తెలిపారు. చెడు గురించి హెచ్చరించిన వారు వినిపించుకోకపోతే అది వారి నిర్ణయానికే వదిలేయాలి అని విదురుడు అంటాడు. ఇలా చేయడం ద్వారా మీరు అన్ని విషయాలతో పాటు తప్పు విషయాలపై కూడా వారికి అవగాహన కలిగించినట్లయితే వారు మీపై సంతృప్తిగా ఉంటారు. ఇప్పుడు ఆ వ్యక్తి తన మంచి చెడ్డలను చూసి తన నిర్ణయం తీసుకోవచ్చు.

Vidura Niti identify the good and people and things

Vidura Niti identify the good and people and things

ఇలా చేయడం వలన రెండు లాభాలు ఉంటాయి. ముందుగా అన్నీ తెలిసిన హెచ్చరించలేదన్న అపరాధ భావం కలగదు. అంతేకాకుండా ఆ వ్యక్తి కూడా భవిష్యత్తులో మీరు తన శ్రేయోభిలాషి అని నమ్ముతారు. విదురుడు విధానాలే కాకుండా అతని జీవితం అంతా కూడా అదే సందేశాన్ని ఇస్తున్నట్లు అనిపిస్తుంది. విదురుడు స్వయంగా తన విధానాలను ధృతరాష్ట్రుడికి చెప్పాడు. యువకుడైన దుర్యోధనుడు ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాడని అతనికి ఫలితం అలానే ఉంటుందని సూచించాడు. అయినా దుర్యోధనుడు విదురుడి విధానాలను అస్సలు అంగీకరించలేదు. కానీ దాని ఫలితం కౌరవుల నాశనానికి కారణం అయింది. అవమానం నిర్లక్ష్యం ఉన్నప్పటికీ విదురుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. కాబట్టి దగ్గరి వారికి అడగకుండానే సలహాలు ఇవ్వమని విదుర నీతి తెలుపుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది