Zodiac Signs : ఆగస్టు 28 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : ఆగస్టు 28 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేషరాశి ఫలాలు : ఈరోజు కొంచెం కష్టపడినా ఎక్కువ లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో సానుకూలమైన మార్పులు జరుగుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. మహిళలకు ధనలాభాలు వస్తాయి. ఈరోజు సూర్య ఆరాధనతోపాటు నవగ్రహ ప్రదక్షణలు చేయడం వల్ల శుభం కలుగుతుంది. వృషభరాశి ఫలాలు : ఈరోజు బాగా శ్రమించాల్సిన రోజు. ఆదాయం తగ్గుతుంది. అనుకోని వారి నుంచి నష్టాలు వస్తాయి. ఆదివారం అయినా బిజీగా గడుపుతారు. మీ కుటుంబంలో మార్పులు జరుగుతాయి. విద్యా, ఉపాధి విషయాలలో […]

 Authored By aruna | The Telugu News | Updated on :27 August 2022,10:40 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు కొంచెం కష్టపడినా ఎక్కువ లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో సానుకూలమైన మార్పులు జరుగుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. మహిళలకు ధనలాభాలు వస్తాయి. ఈరోజు సూర్య ఆరాధనతోపాటు నవగ్రహ ప్రదక్షణలు చేయడం వల్ల శుభం కలుగుతుంది. వృషభరాశి ఫలాలు : ఈరోజు బాగా శ్రమించాల్సిన రోజు. ఆదాయం తగ్గుతుంది. అనుకోని వారి నుంచి నష్టాలు వస్తాయి. ఆదివారం అయినా బిజీగా గడుపుతారు. మీ కుటుంబంలో మార్పులు జరుగుతాయి. విద్యా, ఉపాధి విషయాలలో కష్టపడ్డంత ఫలితం వుండదు. శ్రీ సూర్యనారాయన ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభదినం. అనుకున్న విధంగా గడుస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. ఈరోజు లాభదాయకమైన రోజు. కీలక విషయాలలో ఒక నిర్ణయానికి వస్తారు. అమ్మవారి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు పెద్దల మాటలు వినడం వల్ల మంచి జరుగుతుంది. అనుకోని లాభాలు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. అప్పులు తీసుకోవద్దు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరగుతుంది. ఇష్టదేవతారాధన చేయండి.

Today Horoscope August 28 2022 Check Your Zodiac Signs

Today Horoscope August 28 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. విద్యా విషయాలలో పురోగతి. ఆదాయం కోసం బాగా శ్రమిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : తక్కువ మాట్లాడం వల్ల లాభాలు కలుగుతాయి. విద్యా, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సంతోషవాతావరణం. మహిళలకు లాభదాయకమైన రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

తులారాశి ఫలాలు : అనుకోని కష్టాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక అశాంతి కలుగుతుంది. ఇబ్బందులు తగ్గడం కోసం వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : చేసే పనులలో వేగం పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో లాభదాయకమైన రోజు. కీలక విషయాల్లో పెద్దల సహకారం అందుతుంది. ఇంట్లో వారితో సంతోషంగా గడుపుతారు. మహిళలకు తక్కువ శ్రమతో మంచి పేరు వస్తుంది. శ్రీ ఆదిత్య పారాయణం చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : అనుకోని వారి నుంచి ఇబ్బందులు వస్తాయి, ఆదాయం కోసం బాగా శ్రమిస్తారు. వివాదాలు వస్తాయి కానీ వాటిని అధిగమిస్తారు.. ధైర్యం కోల్పోకుండా ఉండాలిశ్రీ లలితా దేవిని ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు.

మకర రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి, అమ్మ నాన్నల నుంచి ధన సంబంధ ప్రయోజనాలు చేకూరుతాయి. విద్యార్థులకు లాభదాయకమైన రోజు. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా పురోగతి. సూర్యారాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : అప్పులు చేస్తారు. ఆదాయం తగ్గుతుంది., అనారోగ్య సూచన, వివాదాలకు అవకాశం,. ఇంట్లో అనుకోని సమస్యలు రావచ్చు. మహిళలకు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దల మాటలు వినకపోవడం వల్ల ఈరోజు నష్టాలు వస్తాయి. శివాభిషేకం చేయించండి.

మీన రాశి ఫలాలు : అన్నింటా శుభఫలితాలు వస్తాయి చేసే పనులలో లాభాలు కలుగుతాయి. మంచి వార్తలు వింటారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు ప్లాన్‌ చేస్తారు. శుభకార్య ఆలోచన చేస్తారు. మహిళలకు లాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది