Zodiac Signs : డిసెంబర్ 05 సోమవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…?
మేషరాశి ఫలాలు : కోపతాపాలకు ఈ రోజు దూరంగా ఉండాల్సిన రోజు. అనవసరమైన ఆందోళనలు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు, గతంలో పెట్టినవాటికి లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పనిలో అంకిత భావం పెరుగుతుంది. ఉత్సాహంగా, ప్రోత్సాహకరమైన రోజు. జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు. శ్రీ శివాభిషేకం చేయించండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు కొంత ప్రతికూలత కనిపిస్తుంది. చికాకులు పెరుగుతాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆఫీస్లో, బయటా మీరు చేసే పనిలో కష్టపడి పనిచేయాల్సిన రోజు. ఆర్థికంగా బాగుంటుంది. ఇంట్లో ఒకరికి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. మహిలలకు చికాకులు. శ్రీ లక్ష్మీదేవి, శివారాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందికరమైన రోజు. పెట్టుబడులకు అంత అనుకూలమైన రోజు. తోబుట్టువుల నుంచి ఆర్థిక సహకారం అందుతుంది. కార్యాలయంలో లేదా పనిచేస్తున్న చోట మీకు సానుకలమైన మార్పులు జరుగుతాయి. ట్రేడింగ్ వల్ల లాభాలు కలుగుతాయి. మహిలలకు చక్కటి రోజు. శ్రీ పార్వతీ, శివారాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఆర్థికంగా సాధారణ స్థితి. అవసరాలను బట్టే మీరు వస్తువులు కొనండి, ఖర్చులు చేయండి. వ్యాపారంలో బాగస్వాములు సహకరిస్తారు. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. పక్కవారితో అభిప్రాయాలు రావచ్చు కానీ అవి సర్దుకుంటాయి. వ్యాపారంలో చక్కటి రోజు. మహిలలకు మంచి రోజు. గోసేవ చేయండి.
సింహరాశి ఫలాలు : ఆర్థికలాభాలను పొందుతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. పరిస్థితులు కుటుంబానికి అనుకూలంగా ఉంటాయి. కొత్త పథకాలు, వెంచర్లకు ఈరోజు అనుకూలం. ప్రశాంతంగా ఈరోజు గడుపుతారు. వైవాహిక జీవితంలో సంతోషం,సఖ్యత పెరుగుతుంది. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : మానసికంగా, శారీరకంగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.ధనాన్ని బాగానే సంపాదిస్తారు. ఆఫీస్లో పరిస్థితులు అనకూలంగా ఉంటాయి. మహిలల ద్వారా ఆర్థిక లాభాలు వస్తాయి. మహిళలకు చక్కటి రోజు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
తులారాశి ఫలాలు : అనవసర ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త. కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయించాల్సిన రోజు. పెద్ద వ్యక్తుల సహకారం అందుతుంది. ఇంటా, బయటా మీకు చక్కటి అనుకూల ఫలితాలు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ శివారాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : విలువైన వస్తువులు కొంటారు. ప్రేమికులకు మంచిరోజు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో చికాకుల తొలిగిపోతాయి. అన్నదమ్ముల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అన్ని రకాలుగా బాగుంటుంది. మహిళలకు చక్కటి రోజు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : కొత్త పనులు ప్రారంభించడానికి మంచి రోజు. అనుకోని అవకాశాలు వస్తాయి. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ చిరకాల కోరికలు తీరుతాయి. లక్ష్యసాధనలో ముందుకుపోతారు. కుటుంబంలో చక్కటి వాతావరణం. ప్రేమికులకు మంచి రోజు. వ్యాపారాలలో లాభాలు. వైవాహిక జీవిత భాగస్వామితో చక్కగా గడుపుతారు. శివాలయంలో ప్రదక్షణలు చేయండి,.
మకరరాశి ఫలాలు : పనులపై శ్రద్ధ పెట్టాల్సిన రోజు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకునేటపుపడు ఆచితూచి జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు ఆనవసర ప్రయాణాలు. వత్తిడికి గురవుతారు. ఆఫీస్లో గాసిప్స్కు దూరంగా ఉండాలి. ఉత్సాహంగా గడుపుతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
కుంభరాశి ఫలాలు : మీకు పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. తోబుట్టువుల ద్వారా సహకారం అందుతుంది.అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కుటుంబంలో చక్కటి రోజు. వ్యాపారులకు మంచిరోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి.
మీనరాశి ఫలాలు : చక్కటి రోజు. చక్కటి ఆరోగ్యం. పిల్లల చదువుకోసం ధనం వెచ్చిస్తారు. బిజీ బిజీగా గడుపుతారు. ప్రేమికులకు మంచి రోజు. ఇష్టమైన వారి కలయిక. జీవిత భాగస్వామితో చక్కగా గడుపుతారు. ఆర్థికంగా బాగుంటుంది. మంచి వాతావరణం. అన్నింటా విజయం సాధిస్తారు. శ్రీ హనుమాన్ చాలీసా పారాయనం చేయండి.