zodiac signs will become gold that has been trapped in the soil
మేషరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూల వాతావరణం ఉంటుంది. అనుకోని ఇబ్బందులు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారులకు సామాన్య స్థితి. అనుకోని వివాదాలు రావచ్చు. కాలభైరవాష్టకం పారాయణం చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు సంతోషం నిండిన రోజు. చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మంచి వార్తలు వింటారు. పాలు, కిరాణం, వస్త్ర వ్యాపారులకు లాభాలు రావచ్చు. మహిళలకు సంతోషమైన వార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. శుభఫలితాల కోసం శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.
మిధునరాశి ఫలాలు : ఈరోజు చికాకులతో కూడిన రోజు. మంచి పనిచేసినా అపవాదులు రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు, అనవసర ఖర్చులు రావచ్చు. ప్రయాణాల వల్ల శారీరక అలసట, మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు. శుభ ఫలితాల కోసం శ్రీరామ జయరామ జయజయ రామ అనే నామాన్ని కనీసం 108 సార్లు జపించండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు సమాజంలో మీపేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. ఆర్థికంగా ఆశాజనకం. పెద్దల నుంచి సాయం అందుతుంది. అన్నిరకాల వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీశివ పూజ చేసుకోండి.
Today Horoscope december 18 2021 check your zodiac Signs
సింహరాశి ఫలాలు : ఈరోజు శుభవార్తలు వింటారు. అన్ని పనులు పూర్తిచేస్తారు. ఉత్సాహంగా గడుపుతారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు కార్యజయం. మహిళలు చేసే
శ్రమ కు తగ్గ ఫలితం వస్తుంది. వ్యాపారాలలో కొత్త లాభాలు వస్తాయి. శుభ ఫలితాల కోసం శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : ఈరోజు అనుకోని సంఘటనలతో మానసిక అశాంతి. తొందరపాటు పనికిరాదు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. కొత్తగా పనులు ప్రారంభించంకండి. దగ్గరి వారితో కలహాలు. అనారోగ్యం. విద్యార్థులకు పరిస్థితులు నిరాశ పరుస్తాయి. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు పనులు పెద్దగా ముందుకు సాగవు. ఆనారోగ్య సూచన. ఆర్తికంగా సామాన్య స్థితి. పెద్దల ద్వారా ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. కుటుంబంలో వత్తిడి పెరుగుతుంది. మిత్రులు ద్రోహం చేసే అవకాశం ఉంది. మహిళలు వివాదాలకు దూరంగా ఉండాలి. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు సంతృప్తికరమైన రోజు. మంచి ఆహారం, విశ్రాంతి దొరుకుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మంచిరోజు. ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు.
వ్యాపారాలు లాభాల బాటలో గడుస్తాయి. శుభఫలితాల కోసం శ్రీగణపతి ఆరాదన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు మంచిరోజు. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. సోదరులు లేదా సోదరి ద్వారా సహాయం అందుతుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో సంతోషం. ప్రయాణాలు అనుకూలం.అన్ని రకాల వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మంచి ఫలితాల కోసం శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు అనవసర ఖర్చులు వస్తాయి. మిత్రులతో అనవసర విషయాలు చర్చించి సమయం వృథా చేసుకోకండి. కుటుంబ సభ్యులతో తగాదాలు. దూరప్రయాణాలు చేయాల్సి రావచ్చు. చిన్న వ్యాపారులకు నిరుత్సాహం. శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణం చేయండి.
కుంభరాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలు వస్తాయి. విందులు, వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు అవకాశం ఉంది. స్త్రీలు పక్కవారితో జాగ్రత్తగా వుండాలి. విలువైన సామగ్రి జాగ్రత్త. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీ శివ అభిషేకం లేదా హనుమాన్‌కు ఆకు పూజ చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు మంచి ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా సంతోషమైన రోజు. కాంట్రాక్టులు కలసి వస్తాయి. వ్యాపారాలు ముఖ్యంగా పాలు, చిల్లర, దుస్తులు వారికి ఊహించని లాభాలు. అరోగ్యం బాగుంటుంది. ఆఫీస్‌లో పదోన్నతులు లభిస్తాయి. మంచి ఫలితాల కోసం శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.