Zodiac Signs : డిసెంబర్ 24 శనివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?
మేషరాశి ఫలాలు : పని భారం పెరిగినప్పటికీ మీరు తెలివితేటలతో ముందుకు పోతారు. ఆదాయంలో మార్పులు ఉండవు. అనుకోని అతిథి రాకతో ఇంట్లో సందడి. పెద్దల ద్వారా ముఖ్య సమాచారం తెలుసుకుంటారు. అనుకోని వారి నుంచి చక్కటి వార్తలు వింటారు. అన్ని రకాల వృత్తుల వారికి శ్రమతో కూడిన రోజు. శ్రీ హనుమాన్ ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి, ఆదాయంలో చక్కటి పెరుగుదల కనిపిస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. పెద్దల పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం కళ్లా మీరు శుభవార్తలు వింటారు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : అనుకోని ఖర్చులు, వ్యయప్రయాసలతో కూడినర రోజు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో పెద్ద లాభాలు రావు. ప్రయాణ చికాకులు వస్తాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రీ ఆంజనేయదండకం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు మీరు అనుకోని వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వ్యాపారస్తులకు మాత్రం లాభాలు వస్తాయి.విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు చికాకులు పెరుగుతాయి. అమ్మవారి ఆరాధన చేయండి.
సింహ రాశి ఫలాలు : ధైర్యంతోఈరోజు ముందుకుపోతారు. పెద్దల సహకారంతో ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో ఉమ్మడి వ్యాపారాలు కలసి వస్తాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు తొలిగిపోతాయి. ఇష్టదేవతరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : ఈరోజు అన్ని విషయాలలో మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు లాభాలు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : అన్నదమ్ముల నుంచి చక్కటి వార్తలు వింటారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆఫీస్లో లక్ష్యాలను పూర్తి చేస్తారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులకు అనుకూలం. కుటుంబంలో చక్కటి సంతోషకరమైన వాతావరణం. గోసేవ చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : అన్ని రకాలుగా ఇబ్బందులు రావచ్చు, కానీ మిత్రులు, కుటుంబ సభ్యుల సహకారంతో వాటిని అధిగమిస్తారు. ఆఫీస్లో సమస్యలు ఇబ్బంది పెడతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాదన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : అనుకోని వారి నుంచి మీకు నష్టాలు కలుగుతాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. పై అధికారుల ద్వారా పని వత్తిడి కలుగుతుంది. సాయంత్రం నుంచి ఆకస్మిక ధన లాభలున్నాయి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
మకర రాశి ఫలాలు ; మధ్యస్తంగా ఉంటుంది. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో ధన లాభం ఉండకపోవచ్చు. కుటుంబంలో సామరస్యం వాతావరణం ఉంటుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు చక్కటి లాభాలు వస్తాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో మంచి లాభాలు. ప్రయాణ లాభాలు. అనవసర ఖర్చులు. మహిళలకు లాభాలు. షేర్ మార్కెట్లో లాభాలు. మహిళలకు ఇబ్బందులు తొలిగిపోతాయి. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
మీన రాశి ఫలాలు ; అన్ని రకాలుగా బాగుంటుంది. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సహకారం అందుతుంది. అనుకోని వారి నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనకూలం. విదేశీ విద్య్, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయమకైన రోజు. గోసేవ, విష్ణు ఆరాధన చేయండి.