Home » Devotional » Today Horoscope February 06 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : ఫిబ్రవరి 06 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Devotional Desk
The Telugu News | Published on: February 5, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : ఈరోజు చక్కటి ధైర్యంతో ముందుకు పోతారు. పనులు అన్ని పూర్తిచేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూలమైన రోజు. మహిళలకు శుభవార్తలు. కుటుంబంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ ఆదిత్యహృదయం పారాయణం చేయండి.
వృషభరాశి ఫలాలు : కొంచెం ప్రతికూలతతో కూడిన రోజు, ఏ పని చేసినా ఆలోచించి చేయాల్సిన రోజు. కష్టపడి విజయాలను సాధిస్తారు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. మహిళలకు సంతోషం. అమ్మవారి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

Advertisement

మిథునరాశి ఫలాలు : కొంచెం పని భారం పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో ఇబ్బంది పడ్డా చివరకు అంతా సర్దుకుంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండాల్సిన సమయం. అనుకోని వారి నుంచి మహిళలకు ఇబ్బంది. శ్రీ లలితాంబికా దేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : పనులు వేగంగా పూర్తిచేస్తారు.ఆర్థిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. అప్పులు ఎవరికి ఇవ్వకండి. కుటుంబంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులతో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మహిళలకు వస్త్రలాభం. కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

Today Horoscope february 06 2022 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు : ఉత్సాహంగా సాగుతుంది ఈరోజు. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. భవిష్యత్‌ కోసం పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజు. ప్రయాణాల వల్ల లాభాలు వస్తాయి. మహిళలకు శుభమైన రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : విలువైన వస్తువులు కొంటారు. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. ఆర్థిక పురోగతితో కుటుంబంలో సంతోష వాతావరణం. విందులు, వినోదాలలో పాల్గొంటారు. పిల్లల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. మహిళలకు మంచిరోజు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : ఉల్లాసంగా ఈరోజు గడుపుతారు. అనుకోని లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అరోగ్య నియమాలను పాటించాల్సిన సమయం. మహిళలకు అనవసర చికాకులు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ప్రశాంతంగా ఈ రోజు గడుపుతారు. ఆనందంగా పిల్లలు, కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్య విషయాలను పెద్దలతో చర్చించాల్సన సమయం. అన్ని రకాల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ధైర్య సహాసాలతో ముందుకు పోతారు. ఆర్థికంగా మందగమనం కానీ సాయంత్రం కల్లా పరిస్థితి చక్క బడుతుంది. అన్ని రకాల వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. సంతానం వల్ల సంతోషం పొందుతారు. దూరపు బంధువుల నుంచి మంచి వార్తలు వింటారు. ఇష్టదేవతరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : శక్తియుక్తులతో పని చేయాల్సిన రోజు. అనుకోని మార్గాల ద్వారా లాభాలు గడిస్తారు. ఆదాయం పెరుగుతుంది. విలువైన వస్తువులు కొంటారు. కుటుంబం వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. అందరినీ కలుపుకొని పోవాల్సిన రోజు. మహిళలకు సంతోషరకరమైన రోజు. అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : ఈరోజు చాలా ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆహ్లాదం, ఆనందం మీ సొంతం. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. కుటుంబంలో మార్పులు జరుగుతాయి. మహిళలకు శుభవార్తలు. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. అనుకోని చోట నుంచి నష్టాలు రావచ్చు జాగ్రత్త. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల వల్ల చికాకులు. మహిళలకు మామూలుగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమించాల్సిన రోజు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.

Devotional Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి