Zodiac Signs : జనవరి 13 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేషరాశి ఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. మీరు సునాయసంగా ధనాన్ని సంపాదిస్తారు. అనుకోని లాభాలు వస్తాయి. కుటుంబంలోసంతోషకరమైన వాతావరణం. నేడు మీరు ఇబ్బందులు అధిగమిస్తారు. మహిళలకు వస్త్ర లాభాలు కనిపిస్తున్నాయి. శ్రీదుర్గా అమ్మవారి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది, మీకు అనుకోని బాధలు పెరుగుతాయి. శత్రువుల సమస్య. కుటుంబంలో చికాకులు, ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. మహిళలకు మానసిక అశాంతి. మంచి ఫలితాల కోసం శ్రీ దుర్గాదేవి ఆలయం లేదా అమ్మవారి ఆలయంలో ప్రదక్షణలు చేయండి.

మిధునరాశి ఫలాలు : ప్రశాంతమైన రోజు. పనులు పూర్తిచేస్తారు. ఆనందంగా ఈ రోజును గడుపుతారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది,. అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తారు. లలితాదేవి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది. కర్కాటకరాశి ఫలాలు : అన్ని విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. శత్రువులు మిత్రులవుతారు. పని భారం పెరిగినా సునాయసంగా వాటిని పూర్తిచేస్తారు. వ్యాపారాలలో లాభాలు. కుటుంబంలో శుభకార్య యోచన. మహిళలకు మంచి వాతావరణం. అమ్మవారిని మందార పూలతో ఆరాధించండి.

Today Horoscope january 13 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : కొంచెం కష్టంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేయలేక చికాకులు వస్తాయి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. ఇంటా, బయటా మీకు వ్యయప్రయాసలు. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మహిళలకు ప్రయాణ సూచన. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : ఆర్థిక మందగమనం. పనులు ముందుకుసాగవు. అనుకోని నష్టాలు సంభవిస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు. ఆఫీస్‌లో శ్రమ భారం. విద్యార్థులకు కష్టపడ్డా ఫలితం కనిపించదు. మహిళలకు పనిభారం. శ్రీ దుర్గా సూక్తంతో అమ్మవారి పూజ చేయండి.

తులారాశి ఫలాలు : దగ్గరి వారి నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి. సమాజంలో విలువ పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. కొత్త వస్తువులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. మహిళలకు శుభ సమయం. అమ్మవారి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

వృశ్చికరాశి ఫలాలు : ఆకస్మిక ప్రయాణం, దీనితో మానసిక ప్రశాంతత. అనుకోని ధనలాబాలు వస్తాయి. కుటుంబంలోశుభ కార్యాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర విషయాలకు దూరంగా ఉంటారు. ఆర్థిక పురోగతి. మహిళలకు స్వర్ణ లాభం. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. పెద్దల నుంచి ఆంక్షలు వెల్లువెత్తుతాయి. అనుకోని వివాదాలు. మహిళలకు శత్రు ఇబ్బందులు. కాలభైరవాష్టకం పారాయణం చేయండి.

మకరరాశి ఫలాలు : ప్రతికూలమైన రోజు. ఫలితాలు నిరాశజనకంగా ఉంటాయి. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు. పండుగ వాతావరణం కానీ మీకు ప్రశాంతత ఉండదు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. మహిళలకు అనారోగ్యసూచన. శ్రీ లలితాదేవి సహస్రనామాలను చదువండి లేదా వినండి.

కుంభరాశి ఫలాలు : అనుకోని శుభవార్తలు వింటారు. దూర ప్రయాణ సూచన. ఆకస్మిక ధనలాభాలు., వ్యాపారులకు మంచి సమయం. కుటుంబంలో సంతోషం. పిల్లలకు పెద్దల ద్వారా ప్రయోజనాలు. మహిళలకు మంచి సమయం. ఇష్టదేవతారాధన చేయండి.

మీనరాశి ఫలాలు : కొంచెం కష్టం. కొంచెం లాభంతో ఈ రోజు గడుస్తుంది. అనుకోని సమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు. మిత్రులతో వివాదాలు. మహిళలకు వస్త్రలాభావకాశం. ఆర్థిక మందగమనం. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. శ్రీదుర్గా స్తోత్రం పారాయణం చేయండి.

Recent Posts

Father : గుంతలపై వినూత్న నిరసన.. నీటితో నిండిన గుంతలో పడుకుని ఆందోళన చేసిన తండ్రి

Father  : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…

59 minutes ago

Niharika Konidela : ముహూర్తం ఫిక్స్ చేసిన నిహారిక‌.. ఆ రోజు గుడ్ న్యూస్ చెబుతానంటున్న మెగా డాట‌ర్

Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…

2 hours ago

Galla Jayadev : గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు.. మళ్లీ టీడీపీ తరఫునే ప్రయాణం?

Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…

3 hours ago

India Vs England : ఇంగ్లండ్‌పై అద్భుత విజ‌యం సాధించిన భార‌త్.. అద‌రగొట్టిన సిరాజ్

India Vs England : లండ‌న్‌లోని కెన్నింగ్ట‌న్ ఓవ‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం…

4 hours ago

Atukulu : సాయంత్రం స్నాక్స్… వీటిని చీప్ గా చూడకండి… దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే…?

Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…

5 hours ago

KAntara 3 : కాంతార 3కి ప్లాన్.. ప్ర‌ధాన పాత్ర‌లో టాలీవుడ్ స్టార్ హీరో..!

KAntara 3 : సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…

6 hours ago

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?

Women  : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…

7 hours ago

Komati Reddy Rajagopala Reddy : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి .. కుటిల ప‌న్నాగాల‌ను స‌మాజం స‌హించ‌దు. రాజగోపాల్ రెడ్డి !

Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…

8 hours ago