Home » Devotional » Today Horoscope January 26 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : జనవరి 26 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 25, 2022, 10:40 pm
Advertisement

మేష రాశి ఫలాలు : అనుకూలమైన ఫలితాలతో ఈరోజు మంచిగా గడుస్తుంది. పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా సజావుగా సాగుతుంది. వ్యాపారాలు లాభాలు గడిస్తారు. పెద్దల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థులకు మంచిరోజు. మహిళలకు శుభ ఫలితాలు వస్తాయి. సుబ్రమణ్యస్వామి భుజంగం చదువుకోండి లేదా వినండి.వృషభరాశి ఫలాలు : ఈరోజు కొంచెం ఇబ్బంది మరికొంచెం అనుకూలతలతో కూడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి. ఆనుకోని వివాదాలకు అవకాశం కనిపిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు కలసివస్తాయి. బంధువుల సహకారంతో ముందుకుపోతారు. మహిళలకు అనుకోని లాభాలు. శ్రీ దుర్గా సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

మిధున రాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది కానీ మీరు సులువుగా పనులు పూర్తిచేస్తారు. ఆర్తికంగా మంచి ఫలితాలు ఉంటాయి. పెద్దల ఆలోచనలు,సలహాలు లేకుండా కొత్త పనులు ఈరోజు ప్రారంబించకండి. మిత్రులు సహాయంతో ముందుకుపోతారు. మహిళలకు అనారోగ్య సూచన కనిపిస్తుంది. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మంచి రోజు. సానుకూల ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా సంతోషంగా ఉంటుంది. ఫుడ్, మెడికల్ రంగాల వారికి లాభాలు. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం. అమ్మవారి ఆరాధన చేయండి.

Today Horoscope january 26 2022 check your zodiac signs

Advertisement

సింహ రాశి ఫలాలు : ఈరోజు అనుకూలమైన రోజు. మీ పనికి తగ్గ ఫలితం వస్తుంది. అమ్మనాన్నల ఆశీర్వాదతో ముందుకుపోతారు. పాలు, పండ్లు, కూరగాయలు, కిరాణం వారికి మంచి లాభాలు. విద్యార్థులు,ఉద్యోగులకు ఆశించని గుర్తింపు లభిస్తుంది. మహిళలకు మంచి రోజు. శ్రీ శివ పంచాక్షరీని కనీసం 108 సార్లు జపించండి.

కన్యరాశిఫలాలు : ఈరోజు శుభపరిణామాలు జరుగుతాయి. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికపరిస్థితులు కలసి వస్తాయి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. మహిళలకు శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషం. ఇష్టదేవతరాధన చేయండి.

Advertisement

తుల రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. పనులు పెద్దల సహకారంతో పూర్తిచేస్తారు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలు పెద్ద లాభాలు రావు కానీ నష్టాలు రావు. కుటుంబంలో బయటి వారి జోక్యంతో ఇబ్బందులు రావచ్చు. మహిలలకు అనుకూలమైన రోజు. శ్రీ కనక దుర్గా అమ్మవారి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ప్రయాణాలతో చికాకులు. మిత్రులే శత్రువులుగా మారే అవకాశం. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మహిళలకు వంటింట్లో ప్రమాద సూచనలు జాగ్రత్త. కుటుంబంలో సంతోషం. ఇష్టదేవతారాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : అనుకోని శుభ వార్తలు వింటారు. విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నాలకు మంచి రోజు. శుభకార్యలలో పాల్గొంటారు. ఆర్థికంగా సంతోషం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. శ్రీ రామ తారకాన్ని కనీసం 108 సార్లు జపించండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు పని భారం పెరుగుతుంది. ఆఫీస్లో పై అధికారుల వత్తిడి పెరుగుతుంది. అనుకోని ప్రయాణాలు, వివాదాలకు అవకాశం కనిపిస్తుంది. మహిళలు పట్టు విడుపుతో ముందుకుపోవాలి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : అనుకోన్న పనులు పూర్తిచేస్తారు. పట్టుదల మరింత పెరుగుతుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. కుటుంబ సబ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి. మహిళలు దేవతరాధనతో మంచి జరుగుతుంది. ఇష్టదేవతరాధన చేయండి.

మీన రాశిఫలాలు : సంతోషంతో ఈరోజు గడుపుతారు. అనుకోని లాభాలతో ఇంట్లో ఆనందం పెరుగుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహంగా ఉంటాయి. అప్పులు తీరుస్తారు. మహిళలకు విశ్రాంతి. విద్యార్థులకు శుభ వార్తలు వింటారు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి