Home » Devotional » Today Horoscope January 31 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : జనవరి 31 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 30, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : అనుకూలమైన ఫలితాలతో ఈరోజు సంతోషంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. అన్ని రకాల వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. కుటుంబంలో సంతోషం. మహిళలకు ఆనందంగా ఉంటారు. శివాష్టోతరంతో శివపూజ చేయండి. వృషభరాశి ఫలాలు : కొంచెం శ్రమతో కూడిన రోజు. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. ఆధిక ఖర్చులు. ప్రయాణాలతో ఇబ్బందులు. బంధువుల నుంచి చెడు వార్తలు. మహిళలకు సాధారణంగా ఉంటుంది. మారేడు దళాలతో శివారాధన చేసుకోండి.

Advertisement

మిధునరాశి ఫలాలు : శుభవార్తలు వింటారు. మంచి పనులు ప్రారంభిస్తారు. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. మిత్రుల నుంచి సహాయం అందుతుంది. మహిళలకు వస్త్రలాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి, కర్కాటకరాశి ఫలాలు : అనుకున్నవి సాధిస్తారు. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. పెద్దల నుంచి సహాయం అందుతుంది. ఐటీ, రియల్ రాజకీయ రంగాల వారికి అనకూలమైన రోజు. మహిళలకు విశ్రాంతి, అనకూలమైన ఫలితాలు వస్తాయి. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

Today Horoscope january 31 2022 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు : మంచి ఫలితాలతో సంతోషంగా ఈరోజు గడుస్తుంది. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. రుణాల కోసం ప్రయత్నిస్తున్నవారికి మంచి సమయం. ఆర్థిక పురోగతి. కుటుంబంలో శుభకార్య యోచన కనిపిస్తుంది. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

కన్య రాశిఫలాలు : కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అన్ని వృత్తుల వారికి కొంచెం శ్రమించాల్సిన రోజు. పిల్లలకు, విద్యార్థులకు కష్టపడాల్సిన రోజు. మహిళలకు మంచి సమయం. ఇష్టదేవతరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు పడుతారు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. పట్టుదలతో పనులు చేస్తారు. ఆదాయం తగ్గుతుంది. శుభకార్యం కోసం ఖర్చులు చేస్తారు. స్త్రీలకు అనుకోని సమస్యలు. శ్రీ సుబ్రమణ్యారాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. అప్పులు తీరుస్తారు. శుభ వార్తలు వింటారు. దూరపు బంధువులు లేదా దూర ప్రాంతం నుంచి అతిథులు వస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యలు పరిష్కారం. మహిళకు మంచి వార్తలు. ఇష్టదేవతారాధన చేయండి.

ధనస్సురాశి ఫలాలు : మంచి రోజు. సానుకూలమైన వాతావరణం. అత్యంత శుభకరంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఐటీ, రియల్‌, రాజకీయ రంగం వారికి మంచి వార్తలు అందుతాయి. మహిళలకు శుభం. గోసేవ చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

మకర రాశి ఫలాలు : కొంచెం మిశ్రమంగా ఉంటుంది. అనవసర ఖర్చులు, వివాదాలకు ఆస్కారం కనిపిస్తుంది. అనుకున్న పనులను పూర్తిచేయలేరు. ఆదాయం తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు అవకాశం. మిత్రుల సహకారం లభిస్తుంది. మహిళలకు విశ్రాంతి, ఆరోగ్యం. శివాభిషేకం చేయించండి మంచి ఫలితాలు వస్తాయి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకోని ఖర్చులు, చికాకులు. కుటుంబంలో మార్పులు కనిపిస్తున్నాయి. అలసట, అనారోగ్యం. ఆర్థికంగా సాధారణం., వ్యాపారాలు మామూలుగా ఉంటగాయి. మహిళలకు పని బారం పెరుగుతుంది. శ్రీలక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి మంచి జరుగుతుంది.

మీన రాశి ఫలాలు : ప్రతి పనిలోనూ జాప్యం కనిపిస్తుంది. ఆటంకాలతో రోజు గడుస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థికంగా సాధారణ పరిస్థితి. విద్యార్థులు, ఉద్యోగులు కొంచెం శ్రమించాల్సిన రోజు. రియల్, ఐటీ, మెడికల్ రంగాల వారికి శుభకరంగా ఉంటుంది. దగ్గరలోని దేవాలయంలో ప్రదక్షణలు లేదా నవగ్రహ స్తోత్రం చదువుకోవం చేయండి మంచి జరుగుతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి