Zodiac Signs : జూలై 30 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : జూలై 30 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By aruna | The Telugu News | Updated on :29 July 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : అనుకోని మార్గాల ద్వారా లాభాలు సాదిస్తారు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇరుగు, పొరుగుతో ఉన్న విబేధాలు పరిష్కారం అవుతాయి. మంచి వార్తలు వింటారు. శ్రీ లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : మీరు చేసే పనులలో వేగం పెరుగుతుంది. విలువైన వస్తువులను కొంటారు. కుటుంబంలో శుభకార్య ఆలోచన చేస్తారు. అన్ని రకాల వృత్తులలో లాభాలను సాధిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమికులకు ఈరోజు వంసంతం. ఆనందంగా గడుపుతారు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : ఈరోజు కొంచెం కష్టపడాల్సి రావచ్చు. ఆదాయం కోసం బాగా కష్టడుతారు. రుణ ప్రయత్నాలు ఫలించవు. మానసిక ప్రశాంతత కొరవడుతుంది. అన్ని రకాలుగా ఇబ్బందులు. మిత్రులు, బంధువుల నుంచి సహాయం అందక నిరాశ పడుతారు. శ్రీ నారాయణ స్వామి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : చక్కటి పనులు చేస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమికులకు మంచి రోజు. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

today horoscope july 30 2022 check your zodiac signs

today horoscope july 30 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం తక్కువగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. సమాజంలో మంచి పేరు, గౌరవం లబిస్తాయి. అమ్మనాన్నల నుంచి ఆర్థిక లాభాలు అందుతాయి. మహిళలకు చక్కటి రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : చాలాకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తి అవుతాయి. ఆదాయం సంబంధించి సంతోషకరంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అన్నదమ్ముల నుంచి మంచి సహకారం అందుతుంది. ప్రేమికులకు కొత్త విషయాలు తెలుస్తాయి. మహిళలకు వస్త్రలాభాలు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : అన్నింటా ఆటంకాలు కానీ ధైర్యంతో మీరు ముందుకు పోతారు. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. అనారోగ్య సూచన కనిపిస్తుంది. అన్ని రకాల వ్యాపారాలలో పెద్దగా రాకపోయినా ఇబ్బంది నుంచి బయటపడుతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన రోజు. చాలా కాలం తర్వాత మీరు విశ్రాంతి తీసుకునే అవకాశం. విద్యా, ఉద్యోగులకు చక్కటి రోజు. అన్నింటా జయం. విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు లాభాలు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : మీరు గతంలో పెట్టుబడులు లాభాలను తెచ్చిపడుతాయి. ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. అన్నింటా శుభఫలితాలు వస్తాయి. ప్రేమికులకు మంచి రోజు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి శుభవార్తలు. శ్రీ హనుమాన్‌ ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : అన్నింటా ఇబ్బందులు వస్తాయి. కొంచెం శ్రమించాల్సిన రోజు. ఓపిక,సహనంతో ఈరోజు మెలగండి. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఆదాయం తక్కువ అవుతుంది. ప్రయాణ సూచన. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయనమః అనే నామాన్ని కనీసం 108 సార్లు జపించండి.

కుంభ రాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. ప్రేమికులకు మంచిరోజు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలు. మహిళలకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. శ్రీ ఆంజనేయస్వామి ఆరాదన చేయండి.

మీన రాశి ఫలాలు : ఆనుకున్న పనులు పూర్తిచేయలేక పోతారు. ఆదాయం తక్కువ అవుతుంది. ఉమ్మడి పెట్టుబడులకు అనుకూలం కాదు. ఎవరికి అప్పులు ఇవ్వకండి. తీసుకోకండి. ఆరోగ్యం కోసం తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యయప్రయాసలతో కూడిన రోజు. సాయంత్రం నుంచి కొంచెం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అమ్మవారితోపాటు వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి శుభఫలితాలు వస్తాయి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది