Home » Devotional » Today Horoscope March 23 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : మార్చి 23 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 22, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : పెద్దల పరిచయాలు జరుగుతాయి. అన్నదమ్ముల సహయ సహకారం అందుతుంది. అప్పులు తీరుస్తారు. అన్నింటా శుభకరంగా ఉంటుంది. మహిళలకు అనుకూలమైనరోజు. శ్రీ గణపతి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : సంతోషకరమైన రోజు. అన్నింటా జయం కలుగుతుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు చేసేవారికి లాభదాయకమైన రోజు. మహిళలకు మంచి ఫలితాలు. అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

మిధునరాశి ఫలాలు : కొంచెం ప్రతికూలతలతో గడుస్తుంది. సాయంత్రానికి ఊరట కలిగించే ఫలితాలు. అమ్మనాన్నల నుంచి సహాయం అందుతుంది. సమయానికి మిత్రులు, బంధువుల సహాయం అందదు. ఆర్థికంగా మందగమనం. మహిళలకు పని భారం. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. కొన్ని విషయాలలో సానుకూలత, మరొకొన్నింటిలో చికాకులు వస్తాయి. ఎవరికి అప్పులు ఇవ్వకండి. ధన విషయంలో జాగ్రత్త. ప్రయాణాలు చేసేవారు వస్తువులు జాగ్రత్త. అనారోగ్య సూచన. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

Today Horoscope March 23 2022 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు : మంచి విషయాలు తెలుస్తాయి. అనుకోని లాభాలు రావచ్చు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విద్య, ఉద్యోగ విషయాలు అనుకూలం. శ్రీ రామ రక్షా స్తోత్రంపారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది. చికాకులు పెరుగుతాయి. కుటుంబంలో అనుకోని విషయాల కోసం తగులాట. ఆర్థిక పరిస్తితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. మహిళలకు వంటింటి పనుల భారం. శ్రీ అర్క గణపతి ఆరాధన మంచి చేస్తుంది.

Advertisement

తులారాశి ఫలాలు : చాలా సంతోషకరమైన రోజు. ఆనందంగా గడుపుతారు. అప్పులు తీరుస్తారు. ధనలాభాలు కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలో మీకు సంతోషం కలుగుతుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారల వారికి అనుకూలమైన రోజు. నవగ్రహారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

వృశ్చికరాశి ఫలాలు : కొంచెం కష్టంగా ఈరోజు గడుస్తుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో అకస్మాత్తుగా మార్పులు సంభవిస్తాయి. వాహనాలు జాగ్రత్తగా నడపండి. మనస్సు ప్రశాంతత కోల్పోయి ఇబ్బంది పడుతారు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చక్కటి ఫలితాలను ఇస్తుంది.

ధనుస్సురాశి ఫలాలు : ధన సంబంధ విషయాలలో అనుకూలంగా ఉంటుంది. అనుకోని లాభాలు వస్తాయి. కార్యజయం కలుగుతుంది. సమాజంలో మంచి పేరు, గౌరవం లభిస్తాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : శుభకరమైన రోజు. అనుకూలమైన ఫలితాలో ఆనందం. ఆర్థిక విషయాలలో సంతృప్తి. విద్యా, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : మిశ్రమమైన ఫలితాలు వస్తాయి. ఆప్పుల బాధలు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు. కుటుంబ సభ్యుల మధ్య అనవసరంగా వివాదాలు. ఆర్థిక మందగమనం. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : మీరు చేసే పనులలో జాప్యం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆఫీసుల్లో మీకు కొంత ప్రతికూల వాతావరణం. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. మహిళలకు అనారోగ్య సూచన.శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి