
vidya-balan comments about producer
Vidya Balan : డర్టీ పిక్చర్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ విద్యా బాలన్. ఈ అమ్మడు బీటౌన్ లో స్పెషల్ సినిమాలకు పెట్టింది పేరు . హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసినా విద్య లేడీ ఒరియెంటెడ్ మూవీస్.. బయోపిక్ సినిమాలతో ఇండస్ట్రీలో తకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సిల్క్ స్మిత బయోపిక్ ది డర్టీ పిక్చర్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది విద్యాబాలన్. ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది సీనియర్ స్టార్ హీరోయిన్.స్టార్ హీరోయిన్లు కూడా చేయలేని పాత్రలను చేసి అందరిచేత శబాష్ అనిపించుకుంది విద్యా. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అమ్మడు బాడీ షేమింగ్ ఎదుర్కొని, ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూనే ఉంది.
విద్యా బాలన్ తాజాగా నటించిన చిత్రం జల్సా. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు బడ్డానంటూ విద్యా బాలన్ భావోద్యేగానికి లోనయ్యింది. ‘మొదట్లో ఓ నిర్మాత నా పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు. నన్ను బాడీ షేమింగ్ చేస్తూ అసహ్యంగా చూసేశాడు. అతని ప్రవర్తల వల్ల నేను 6 నెలల పాటు అద్దంలో చూసుకునేందుకు కూడా భయపడ్డాను అని చెప్పుకొచ్చింది విద్యా బాలన్2003లో జరిగిన ఈ సంఘటన వలన తాను ఏసినిమాలకు సంతకం చేయలేకపోయానంటోంది. సినిమాలు చేయాలనుకున్న కుదరలేదు.
vidya-balan comments about producer
అంతలా ఆ నిర్మాత తీరు తనపై ప్రభావం చూపింది అంటూ చెప్పుకొచ్చింది.అదే సమయంలో కె బాలచందర్ దర్శకత్వంలో రెండు సినిమాలకు సంతకం చేశానని,కానీ కొన్ని రోజుల తర్వాత ఎలాంటి సమాచారం లేకుండానే ఆ ప్రాజెక్ట్స్ నుంచి తనని తొలగించారని చెప్పింది. అంతేకాదు యాడ్స్ చేసుకుందామంటే.. అందులోనుంచి కూడా తనను తీసేశారంది. అప్పుడు ఈ సంఘటనలు తనని తీవ్రంగా బాధించాయని, చాలా ఏడ్చానని విద్యా పేర్కొంది. అదే బాధలో మెరైన్ డ్రైవ్ నుంచి బాంద్రా వరకు నడుచుకుంటూ వెళ్లానని ఆమె అన్నారు. అలా తనని దాదాపు 13 సినిమాల నుంచి తీసివేశారని విద్యా బాలన్ తెలిపింది.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.