Zodiac Signs : అక్టోబర్ 18 మంగళవారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Zodiac Signs : మేష రాశి : ఎక్కువగా ఆలోచించకండి. మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవాలి. ఉద్యోగ రంగాల్లో ఉన్నవాళ్లు మీ పనులను సరిగ్గా చక్కదిద్దుకోవాలి. మీ ఫోకస్ ను ఏమాత్రం తగ్గించుకోకండి. మీ భాగస్వామి విషయంలో ఎక్కువగా వాదించకపోవడమే మంచిది. నిశ్శబ్దమే దానికి సమాధానం. తక్కువ ఆదాయం, ఎక్కువ ఖర్చులు ఉంటాయి. పంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వృషభ రాశి : ఈరోజు మీరు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. మీలో మీరే విజయాన్ని వెతుక్కుంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ రంగాల్లో ఉన్నవాళ్లకు ఈరోజు చాలా బాగుంది. మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. మీ భాగస్వామితో జాగ్రత్తగా మెలగాలి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. పెట్టుబడులు పెడతారు. డబ్బులను ఆదా చేస్తారు. ఆరోగ్యం మీకు అన్ని విధాలా సహకరిస్తుంది.

మిధున రాశి : ఈరోజు మీకు అనుకూల దినం కాదు. అయినప్పటికీ మీ పనుల కోసం మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లకు ఈరోజు అంతగా అనుకూలంగా ఉండదు. పని ఒత్తిడి పెరుగుతుంది. మీ జాబ్ విషయంలో చాలా ప్రొఫెషనల్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. భాగస్వామితోనూ కొన్ని మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే డబ్బులు వృధాగా ఖర్చు కావు. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాళ్ల నొప్పి బాధిస్తుంది. కొన్ని రకాల వ్యాయామాలు చేస్తే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. కర్కాటక రాశి : ఈరోజు మీరు ఒత్తిడిలో ఉంటారు. ఒత్తిడిని దూరం చేసుకోవడం కోసం మ్యూజిక్ వినండి. లేదా సినిమాలు చూడండి. మీకు సంతోషం కలిగించే పని చేసి ఒత్తిడిని దూరం చేసుకోండి. పెద్ద నిర్ణయాలు ఏవీ తీసుకోకండి. పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. పని భారం పెరుగుతుంది. భాగస్వామితోనూ సఖ్యతగా ఉండలేరు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మీకు సాధ్యమైనంత డబ్బును ఆదా చేసేందుకు ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు.

Today Horoscope October 18 2022 Check Your Zodiac Signs

సింహ రాశి : మీరు ఈరోజు మీలో ఉన్న ధైర్యం, పట్టుదలను బయటికి తీయాలి. మీ ఫోకస్ ఏంటి.. మీ లక్ష్యం ఏంటి అనేదానిపై దృష్టి పెట్టాలి. చాలా ధైర్యంగా ఉండాలి. పని ఒత్తిడి ఉంటుంది. అందుకే మీరు ఈరోజును సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. మీ భాగస్వామితో సరిగ్గా ఉండలేరు. డబ్బులు ఆదా చేయలేరు. మీకు ఖర్చులు పెరగడం వల్ల అనుకున్న సమయానికి డబ్బులు అందకపోవడంతో ఖర్చుల భారం పెరుగుతుంది. తలనొప్పి లాంటి సమస్యలు బాధిస్తాయి. మెడిటేషన్ చేయండి.. కాస్త ఉపశమనం కలుగుతుంది.

కన్య రాశి : ఈరోజు మీకు అనుకూల దినం. చాలా ఈజీగా మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతోషంగా ఉంటారు. పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. మీ షెడ్యూల్ ప్రకారం మీ పని పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పు చేయాల్సి వస్తుంది. మీ ఎనర్జీ లేవల్స్ ఈరోజు బాగుంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.

తుల రాశి : ఈరోజు మీకు బాగుంది. మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీ ధైర్యం, పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీ నమ్మకమే మీకు పెట్టుబడి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈరోజు బాగుంటుంది. మీ స్కిల్స్ మీ బాస్ ను మెప్పిస్తాయి. భాగస్వామితోనూ బాగుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చిక రాశి : పాజిటివ్ గా ఆలోచించండి. ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి ఈరోజు శుభదినం. భాగస్వామితో మంచిగా మెలగాలి. ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. పంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ధనస్సు రాశి : మానసిక ఒత్తిడి పెరుగుతుంది. రిలాక్స్ అవడం బెటర్. ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు పని మీద దృష్టి కేంద్రీకరించాలి. భాగస్వామితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. డబ్బుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కువగా ఖర్చు చేయకండి. కాళ్ల నొప్పి వచ్చే అవకాశం ఉంది.

మకర రాశి : మీకు ఈ రోజు అనుకూలమైన రోజు. కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీ పార్టనర్ తో ఆనందంగా ఉంటారు. డబ్బుల విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. ఆర్థికంగా బాగుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

కుంభ రాశి : ఈ రోజు మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు. మీ భవిష్యత్తకు సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకుంటారు. మీ స్కిల్స్ చూసి మీ బాస్ మెచ్చుకుంటారు. మీ భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. మీరు చాలా అన్యోన్యంగా ఉంటారు. డబ్బులకు కొదవ ఉండదు. డబ్బులు ఆదా చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

మీన రాశి : మీకు సహనం చాలా అవసరం. ఉద్యోగ రంగాల్లో ఉన్నవాళ్లు చాలా ఎక్కువ కష్టపడతారు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా కొన్ని సమస్యలు వస్తాయి. డబ్బు ఆదా చేయడం మంచిది. ఆరోగ్యం సహకరించదు. అనారోగ్యం బాధిస్తుంది.

Recent Posts

Rice | నెల రోజులు అన్నం మానేస్తే శరీరంలో ఏమవుతుంది? .. వైద్య నిపుణుల హెచ్చరికలు

Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…

9 hours ago

Montha Effect | ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ఆగ్రహం .. నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం

Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…

11 hours ago

Harish Rao | హరీశ్ రావు ఇంట్లో విషాదం ..బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి విరామం

Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…

13 hours ago

Brown Rice | తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్‌ ఆరోగ్యానికి మేలు.. నిపుణుల సూచనలు

Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…

14 hours ago

Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?

Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…

17 hours ago

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

20 hours ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

1 day ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

1 day ago