Zodiac Signs : అక్టోబర్ 22 శనివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : అక్టోబర్ 22 శనివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

 Authored By gatla | The Telugu News | Updated on :21 October 2022,10:40 pm

Zodiac Signs : మేష రాశి : ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. మీ లక్ష్యం కోసం పని చేస్తారు. మెడిటేషన్, ప్రేయర్స్ లాంటివి చేస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఈరోజు చాలా బాగుంది. మీ స్కిల్స్ ను బాస్ మెచ్చుకుంటారు. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యంతో ఉంటారు. వృషభ రాశి : ఈ రోజు మీకు చాలెంజింగ్ గా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు ఉద్యోగం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో మీరు సహనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తగా ఓపికతో ఉండండి. మీ జీవిత భాగస్వామితో ఈగో సమస్యలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

మిథున రాశి : మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్తగా వ్యవహరించండి. అహర్నిశలు పని చేయడం వల్ల కొంచెం ఎగ్జయిట్ అవుతారు. సహనం చాలా అవసరం. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారి ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. మీ జీవిత భాగస్వామితో గొడవలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్యం సహకరించదు. కర్కాటక రాశి : ఈరోజు మీకు పట్టిందల్లా బంగారమే. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా చాలా బాగుంది. మీ టాలెంట్ మిమ్మల్ని ఉన్నతులను చేస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం సహకరిస్తుంది.

Today Horoscope October 22 2022 Check Your Zodiac Signs

Today Horoscope October 22 2022 Check Your Zodiac Signs

సింహ రాశి : మీ భవిష్యత్తు కోసం చాలా ఆలోచిస్తారు. నెగెటివ్ గా ఆలోచించడం తగ్గించండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి పెరుగుతుంది. తోటి ఉద్యోగులతో సఖ్యతతో మెలగండి. మీ జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాకుండా చూసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అనారోగ్యం బాధిస్తుంది.

కన్య రాశి : ఆశావాదంతో బతకండి. నిరాశను అస్సలు దగ్గరకు రానివ్వకండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు పట్టుదలతో పని చేయాలి. అలా అయితేనే మీ డ్యూటీ సరిగ్గా చేయగలరు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండలేరు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్యం కూడా సహకరించదు.

తుల రాశి : మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోండి. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో ఈగో సమస్యలు వస్తాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

వృశ్చిక రాశి : ఈరోజు మీకు అనుకూలమైన దినం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ.. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు తమ టాస్క్ లను పూర్తి చేయడంలో కష్టపడాల్సి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యం సహకరిస్తుంది.

ధనస్సు రాశి : ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీకు కావాల్సిన వాళ్లు దగ్గరవుతారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలం. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యంగా ఉంటారు.

మకర రాశి : కొంచెం అలసటగా ఉంటారు. ఏ పనీ సరిగ్గా చేయలేరు. భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి పెరుగుతుంది. మీ భాగస్వామితో మీ ఫీలింగ్స్ ను పంచుకోండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరించదు.

కుంభ రాశి : ఈరోజు అంతగా అనుకూలమైన రోజు కాదు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సఖ్యతతో ఉండరు. డబ్బుల సమస్యలు అధికం అవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

మీన రాశి : ఈరోజు మీకు అనుకూలమైన దినం. మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు టాస్క్ లను వెంటనే పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సఖ్యతతో ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం బాగుంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది