Zodiac Signs : అక్టోబర్ 27 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : అక్టోబర్ 27 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By prabhas | The Telugu News | Updated on :26 October 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : మీ సోదర, సోదరీ వర్గం సహకారం మీకు లభిస్తుంది. కుటుంబంలో ధన సంబంధ విషయంలో విబేధాలు రావచ్చు. చేసే పనులలో మీరు మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారాలలో మంచి లాభాలను సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : ఆర్థిక లాభాలను గడిస్తారు. అనుకోని చోట నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆపీస్‌లో మీకు తెలివితేటలకు పదును పెట్టాలి. కష్టపడి చేయాల్సిన రోజు. ఆశించిన మేర పనులను పూర్తిచేస్తారు. కుటుంబంలో చక్కటి వాతావరణం. మహిళలకు లాభాదాయకమైన రోజు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఆథ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. మీ కలలు నెరవేరే అవకాశం ఉంది. ఆన్నదమ్ముల నుంచి మంచి సహకారం అందుతుంది. శ్రీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు అన్నింటా చక్కటి ఫలితాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. అనుకోని చోట నుంచి ధనం వస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణ సూచన. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ కాలభైరావాష్టంక పారాయణం చేయండి.

Today Horoscope October 27 2022 Check Your Zodiac Signs

Today Horoscope October 27 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : అలసట, వత్తిడితో కూడిన రోజు. కొత్త ఆలోచనలతో ముందుకుపోవాలని చూస్తారు కానీ మీరు వాటిని సాధించలేరు. పనులలో జాప్యం పెరుగుతుంది. విజయం కోసం పరిశ్రమిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది వైవాహిక జీవితం ఇబ్బందికరంగా ఉంటుంది. శ్రీ లలితాదేవి ఆరాదన చేయండి.

కన్యా రాశి ఫలాలు : ఆటంకాలతో కూడిన రోజు. ఆదాయం తగ్గుతుంది. అనుకోని ప్రయాణ సూచన. వ్యాపారాలలో లాభాలు రావు. ఆఫీస్‌లో సాధారణంగా ఉంటుంది. ప్రయాణ సూచన కనిపిస్తుంది. ఆనుకోని ఖర్చులు వస్తున్నాయి. శ్రీ రామ తారక మంత్రాన్ని కనిపించండి.

తులా రాశి ఫలాలు : ఆర్థికంగా ఇబ్బందులు. అనుకోని ఖర్చులు వస్తాయి. అన్నదమ్ముల నుంచి వత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో చిన్నిచిన్న ఇబ్బందులు. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. ఆదాయం కోసం కొత్త మార్గాలను వెదుకుతారు. శ్రీ నవగ్రహారాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు :మీకు చక్కటి లాభాలు వచ్చే రోజు. అన్ని రకాల వ్యాపారులకు మంచి వార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. కొత్త ఒప్పందాలకు మంచి రోజు. అన్నింటా మీరు ముందడుగు వేస్తారు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : చక్కటి సానుకూల ఫలితాలతో ఈరోజు ముందకు వెళ్తారు. ఆదాయం సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో సానుకూల మార్పులు. విదేశీ ప్రయత్నాలు అనుకూలం. కొత్త ఆలోచనలతో ముందుకు పోతారు. అమ్మ తరుపు బంధువుల నుంచి చక్కటి ప్రయోజనాలు పొందుతారు. శ్రీ దుర్గా సూక్తంతో ఆమ్మవారి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : కొత్త పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. దూరపు ప్రాంతం నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త పెట్టుబడులకు అనుకూలమైన రోజు. పాత బకాయిలు మీకు అందుతాయి. స్త్రీ మూలకంగా లాభాలు అందుతాయి. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అనుకోని చోట నుంచి ఆదాయం మీకు వస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అప్పులను తీరుస్తారు. పెద్దల దీవెనలతో మీరు ముందుకుపోతారు. కుటుంబంలో చక్కటి వాతావరణం. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : ఆరోగ్యం కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు. పిల్లల ద్వారా ప్రయోజనాలు, కీర్తి పొందుతారు,. సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను తెస్తాయి. శ్రీ శివారాధన చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది