Zodiac Signs : సెప్టెంబర్ 24 శనివారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేష రాశి ఫలాలు : అన్ని సమస్యలకు పరిష్కారం అవుతాయి. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అమ్మ తరపు వారి నుంచి శుభవార్తలు వింటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మహిళలకు లాభాలు వస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. పనులు వేగంగా పూర్తిచేస్తారు. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : కుటుంబంలో అనుకోని మార్పులు. అనుకోని వివాదాలు వస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. పనులలో జాప్యం పెరుగుతుంది. ఆస్తి సంబంధ విషయాలలో ఇబ్బందులు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ లక్ష్మీ ఆష్టోతరం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : బయట వ్యక్తుల ద్వారా లాభాలను పొందుతారు. ఆర్థికంగా చక్కటి శుభ పలితాలు. వ్యాపారాలలో సమస్యలు తొలిగిపోతాయి. ప్రయాణాలు చేస్తారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. మహిళలకు వస్త్ర్లలాభాలు అందుతాయి. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.

Today Horoscope September 24 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : వివాదాలకు దూరంగా ఉండండి. అనుకోని వివాదాలు వస్తాయి. ఆర్థికం మందగమనం. పని భారం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు. వ్యాపారాలలో సామాన్యం. మహిళలకు కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. శ్రీ గోవింద నామాలను పారాయణం చేయండి.
కన్య రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా అవసరాలకు ధనం అందుతుంది. ఆనారోగ్య సమస్యలు. జీవిత భాగస్వామితో చిన్నిచిన్న సమస్యలు వస్తాయి. మహిళలకు మామూలుగా ఉంటుంది. లాభాలు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : అన్నింటా జయం సాధిస్తారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతారు,. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. మీరు చేసే పనులలో తగిన ఫలితం లభిస్తుంది. ఇష్టదేవతరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : పెద్దల ద్వారా సలహాలు తీసుకుంటారు. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. వాహన ప్రాప్తి. ఉద్యోగులకు పదోన్నతులు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. మిత్రుల ద్వారా ఆహ్వానాలు. మహిళలకు శుభ వార్తలు అందుతాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి వజ్రకవచం చదువుకోండి.
ధనస్సు రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు ఇబ్బందులు తొలిగితాయి. వ్యాపారాలలో లాభాలు. ప్రయాణ లాభాలు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. శ్రీ ఆంజనేయారాధన చేయండి.
మకర రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందులు. వ్యాపారాలలో స్వల్పలాభాలు. అనుకోని ప్రయాణాలు. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. కుటుంబంలో అనకోని మార్పులు. ధన సంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు వస్తాయి. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : అనుకోని చోట నుంచి శుభవార్తలు. ఈరోజు విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు తొలిగిపోతాయి. విద్యార్థులకు, మహిళలకు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. గోసేవ చేయండి.
మీన రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు. వ్యాపారాలలో మాత్రం లాభాలు వస్తాయి. అనుకోని వారి నుంచి ఇబ్బందులు వస్తాయి. పనులలో జాప్యం కానీ చివరికి వాటిని పూర్తిచేస్తారు. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. మహిళలకు పనిభారం. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.