Zodiac Sign : కొత్త సంవత్సరం ఏ రాశి వారికి కాసులు కురిపిస్తుందంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Sign : కొత్త సంవత్సరం ఏ రాశి వారికి కాసులు కురిపిస్తుందంటే..?

 Authored By mallesh | The Telugu News | Updated on :29 December 2021,6:15 am

zodiac sign : భారతీయులు జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. కొందరైతే గ్రహలు, వాటి మూమెంట్స్ ఆధారంగా తమ పనులను, ఆర్థిక వ్యవహారాలను వాయిదా వేస్తుంటారు. దేశంలో చాలా మంది సెంటిమెంట్స్‌ను నమ్ముతుంటారు. శుభకార్యం, కొత్త బిజినెస్, వాహన కొనుగోలు, నూతన గృహం కొనుగోలు వంటివి చేయాలంటే మంచి రోజులను వెతుకుతుంటారు. తమ రాశిఫలం ప్రకారం ఈ పనిచేస్తే లాభిస్తుందా? నష్టం వాటిల్లుతుందా? అని ముందే ఆరా తీసి ప్రారంభిస్తారు.కొందరు మాత్రం జాతకాలు, గ్రహలు వ్యక్తుల జీవితాన్ని మారుస్తాయంటే చాలా తేలికగా తీసుకుంటారు. నాస్తికులు సైన్స్‌ను మాత్రమే నమ్ముతారు. దేవుళ్లను, జాతకాలను నమ్మరు.

రాశిఫలాలు, జాతకాలను నమ్మేవారి కోసమే ఈ కథనం..ప్రతీ ఏడాది కొత్త క్యాలెండర్ వస్తుంది. విదేశీయులు సాధారణ క్యాలెండర్‌ను ప్రమాణికంగా తీసుకుంటుంటారు. కానీ భారతీయులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉగాది పండుగకు వచ్చే కొత్త పంచాంగాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ ఏడాది ఎవరి జాతకం ఎలా ఉందో అని వారి వారి రాశుల ఆధారంగా ఓ నిర్దారణకు వస్తారు. అయితే, 2022వ సంవత్సరం ఎలా ఉండబోతుందో అని కొందరు జ్యోతిష్కులు ప్రస్తుత పంచాంగాన్ని బేరీజు వేసుకుని ముందే చెప్పగలుగుతారు. ఎందుకంటే వారికి రాశిఫలాలు, గ్రహల మూమెంట్స్ గురించి ఓ అంచనా ఉంటుంది.

zodiac sign for new year is helping to earn money

zodiac sign for new year is helping to earn money

zodiac sign : కొత్త ఏడాది ఆర్థికంగా ఎవరికి అనుకూలం

వచ్చే ఏడాది 2022లో ఏ రాశి వారు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా స్థిరంగా ఉంటారో, ఎవరు అప్పులపాలై, అనారోగ్యం బారిన పడుతారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ముందుగా మేషరాశి వారికి ఆర్థికంగా ఒడిదుడుకులతో పాటు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. వృషభరాశి వారికి మాత్రం కాసుల వర్షం కురవబోతోంది. ఆరోగ్యపరంగా ఓకే.. మిథునరాశి వారు కూడా ఆర్థికంగా స్థిరంగా ఉండి ఆనందగా గడుపుతారు.కర్కాటర రాశి వారు కూడా ఆర్థికంగా పుంజుకుంటారు. ఖర్చులు తగ్గించాలి. చివరగా సింహ రాశి వారు ఆర్థికంగా దెబ్బతింటారు. ఈ ఏడాది వీరికి కష్టాలు తప్పవు.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది