Boduppal Circle : వేగవంతంగా బోడుప్పల్ సర్కిల్‌లో రోడ్ల మరమ్మతులు .. డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజకు కృతజ్ఞతలు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 25 February 2026, 8:30 pm
  •  Boduppal Circle : వేగవంతంగా బోడుప్పల్ సర్కిల్‌లో రోడ్ల మరమ్మతులు .. డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజకు కృతజ్ఞతలు

Boduppal Circle : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్‌లో రోడ్ల దుస్థితిపై వచ్చిన ఫిర్యాదులకు అధికారులు తక్షణమే స్పందించారు. 9వ డివిజన్ (మేడిపల్లి), 10వ డివిజన్ (పీర్జాదిగూడ) ప్రాంతాల్లో ప్రధాన రహదారులు గుంతలతో నిండిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం కారణంగా రోడ్లపై ఏర్పడిన గుంతలు ప్రమాదాలకు దారితీసే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజకు వినతి పత్రం సమర్పించారు…

Deputy Commissioner A. Sailaja responded to the road repairs

Boduppal Circle : వేగవంతంగా బోడుప్పల్ సర్కిల్‌లో రోడ్ల మరమ్మతులు .. డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజకు కృతజ్ఞతలు

రహదారుల దుస్థితి వల్ల రోజువారీ ప్రయాణాలు కష్టసాధ్యంగా మారాయని, అత్యవసర సేవల వాహనాల రాకపోకలకూ ఆటంకం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ప్యాచ్ వర్క్ పనులు ప్రారంభించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.వినతి పత్రంపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజ సమస్య తీవ్రతను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదు అందిన కొద్ది సమయంలోనే సంబంధిత సిబ్బంది రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన ప్యాచ్ వర్క్ పనులు ప్రారంభించారు.

ప్రధాన రహదారులపై గుంతలను పూడ్చి, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజా సమస్యలపై స్పందించి వెంటనే పనులు ప్రారంభించినందుకు డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజకు తుంగతుర్తి రవి కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది చురుకుదనాన్ని కూడా ఆయన అభినందించారు. ప్యాచ్ వర్క్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు తుంగతుర్తి రవి తో పాటు ప్రణయ్, మహ్మద్ మజర్, నాగరాజు, కాటపాక సంతోష్, సాయి తదితరులు హాజరయ్యారు. రోడ్ల మరమ్మతులు పూర్తయ్యే వరకు పర్యవేక్షణ కొనసాగిస్తామని వారు తెలిపారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి