కొవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ టైంలో ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్స్ కూడా క్లోజ్ అయ్యాయి. పలు ప్రదేశాలకు విమానాల సర్వీసులు దాదాపుగా ఏడాదిన్నర పాటు లేకుండా పోయాయి. కాగా, లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కొన్ని ప్రాంతాలకు మళ్లీ ఎరోప్లేన్ సర్వీసెస్ స్టార్ట్ అయ్యాయి. ఎయిర్ పోర్టులలో కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు నిర్వాహకులు.
ప్రయాణికుల కోసమై రెగ్యులర్‌గా శానిటైజేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విమానాల్లో ప్రయాణించే వారు తప్పక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం కంపల్సరీ అని తెలుపుతున్నారు. ఇకపోతే ఈ సంగతులు పక్కనబెడితే.. తాజాగా హైదరాబాద్ నుంచి శ్రీలంక దేశంలోని కొలంబోకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. దాదాపుగా 19 నెలల తర్వాత శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం హైదరాబాద్ నుంచి నుంచి కొలంబోకు బయలుదేరింది. వారానికి రెండు సార్లు ఈ ప్లేన్ సర్వీసులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇకపోతే కొలంబో నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానానికి జీఎంఆర్ ప్రతినిధులు స్వాగతం పలికగా, ఇక్కడి నుంచి అక్కడికి చేరుకునే విమానానికి కొలంబోలో అధికారులు స్వాగతం పలకనున్నారు. విమానాల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎయిర్ పోర్టు అధికారులు సూచిస్తున్నారు. కొవిడ్ న్యూ వేరియంట్స్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
This website uses cookies.