Hyderabad.. శ్రీలంక విమాన సర్వీసులు షురూ.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hyderabad.. శ్రీలంక విమాన సర్వీసులు షురూ..

కొవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ టైంలో ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్స్ కూడా క్లోజ్ అయ్యాయి. పలు ప్రదేశాలకు విమానాల సర్వీసులు దాదాపుగా ఏడాదిన్నర పాటు లేకుండా పోయాయి. కాగా, లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కొన్ని ప్రాంతాలకు మళ్లీ ఎరోప్లేన్ సర్వీసెస్ స్టార్ట్ అయ్యాయి. ఎయిర్ పోర్టులలో కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు నిర్వాహకులు. ప్రయాణికుల కోసమై రెగ్యులర్‌గా శానిటైజేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విమానాల్లో ప్రయాణించే వారు […]

 Authored By praveen | The Telugu News | Updated on :4 September 2021,10:11 am

కొవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ టైంలో ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్స్ కూడా క్లోజ్ అయ్యాయి. పలు ప్రదేశాలకు విమానాల సర్వీసులు దాదాపుగా ఏడాదిన్నర పాటు లేకుండా పోయాయి. కాగా, లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కొన్ని ప్రాంతాలకు మళ్లీ ఎరోప్లేన్ సర్వీసెస్ స్టార్ట్ అయ్యాయి. ఎయిర్ పోర్టులలో కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు నిర్వాహకులు.

ప్రయాణికుల కోసమై రెగ్యులర్‌గా శానిటైజేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విమానాల్లో ప్రయాణించే వారు తప్పక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం కంపల్సరీ అని తెలుపుతున్నారు. ఇకపోతే ఈ సంగతులు పక్కనబెడితే.. తాజాగా హైదరాబాద్ నుంచి శ్రీలంక దేశంలోని కొలంబోకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. దాదాపుగా 19 నెలల తర్వాత శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ విమానం హైదరాబాద్ నుంచి నుంచి కొలంబోకు బయలుదేరింది. వారానికి రెండు సార్లు ఈ ప్లేన్ సర్వీసులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇకపోతే కొలంబో నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ విమానానికి జీఎంఆర్‌ ప్రతినిధులు స్వాగతం పలికగా, ఇక్కడి నుంచి అక్కడికి చేరుకునే విమానానికి కొలంబోలో అధికారులు స్వాగతం పలకనున్నారు. విమానాల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎయిర్ పోర్టు అధికారులు సూచిస్తున్నారు. కొవిడ్ న్యూ వేరియంట్స్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది