అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ మూఢనమ్మకాలను ఆసరా చేసుకుని డబ్బు దోచుకుంటున్న ముఠాను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రెండేళ్లుగా తప్పించుకున్న తిరుగుతున్న ఎనిమిది మందని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఈ సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రంలో ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ముఠా చేసిన మోసాలను వివరించారు. ప్రజల్లో మూఢనమ్మకాలను ఇంకా పెంచి వారి వద్ద నుంచి డబ్బు కాజేయడమే వీరి టార్గెట్ అని పోలీసులు తెలిపారు.
ఈ ముఠా ఓ వ్యక్త నుంచి ఏకంగా రూ.62 లక్షలు కాజేసింది. మహారాష్ట్రలోని వాసి జిల్లా రిసోడ్‌కు చెందిన మహమ్మద్ తాశావర్‌ఖాన్, సయ్యద్‌ఇక్బాల్, అజయ్, భీంరావు, అలీముద్దీన్, నవాజ్‌షేక్, హైదరాబాద్‌కు చెందిన అన్వర్‌ఖాన్, షేక్‌బషీర్ ఓ ముఠాగా ఏర్పడి మంత్రాల పేరిట ప్రజలను మోసం చేయడం స్టార్ట్ చేశారు. వీరు జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉప్పలకు చెందిన ప్రహ్లాద్‌రెడ్డికి 2019 అక్టోబర్‌లో మాయమాటలు చెప్పారు. నాగదేవతకు పూజలు చేస్తే ప్రత్యేక శక్తులు వస్తాయని నమ్మించారు. ఈ క్రమంలోనే పూజా చేస్తున్నట్లు చెప్పి ఇంట్లోకి వెళ్లి పూజ చేస్తున్నట్లు యాక్షన్ చేసి మత్తు మందున్న పౌడర్ ప్రహ్లాద్‌రెడ్డిపై చల్లి ఇంట్లోని రూ.62.5 లక్షలను దోచుకెళ్లారు. బాధితుడు రెండ్రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇదే తరహాలో ముఠా సభ్యులు తుపత్రాలలో సూర్యవెంకటన్నగౌడ్ అనే వ్యక్తికి మాయమాటలు చెప్పి రూ.30 వేలు కాజేశారు. పోలీసులు ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి రాగి రింగులు, సెల్ ఫోన్లు, విభూతి, నాగుపాముతో పాటు రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో చురుకుగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.