Viral News : భోజ‌నంలో చ‌ట్నీ ఎక్క‌వ వేసావ‌ని అలిగిన‌ భ‌ర్త‌.. సూసైడ్ చేసుకున్న భార్య..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral News : భోజ‌నంలో చ‌ట్నీ ఎక్క‌వ వేసావ‌ని అలిగిన‌ భ‌ర్త‌.. సూసైడ్ చేసుకున్న భార్య..!

 Authored By jyothi | The Telugu News | Updated on :9 January 2024,5:00 pm

Viral News : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఓవిషాదం చోటుచేసుకుంది. చట్నీ విషయంలో తలెత్తిన గొడవ గొడవ భార్య ఆత్మహత్యకు దారితీసింది. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసే టైంలో చట్నీ ఎక్కువ వేసావ్ అంటూ రమణ భార్యతో గొడవపడ్డాడు.. సోమవారం అతడు విధుల్లోకి వెళ్ళగా.. రమణకి తన భార్య పలుమార్లు వీడియో కాల్ చేసింది.

అతడు స్పందించకపోవడంతో ఫోన్ చేసి కావాలనే తనతో గొడవ పడుతున్నావు అంటూ పెద్దగా కేకలు వేసింది.తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అనుమానం వచ్చిన రమణ యజమానికి ఫోన్ చేసి తన ఇంటి వెళ్ళమని యజమాని కోరారు.. యజమాని విరిగు పొరుగుని తీసుకొని వెళ్లి తలుపులు పగలకొట్టి లోపలికి ప్రవేశించగా అప్పటికే చందన విగత జీవిగా మిగిలింది. చందన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చందన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు. కొత్తగూడెం తండా కి చెందిన రమణ. ఖమ్మం జిల్లా తండకు చెందిన చందనను రమణ ప్రేమ వివాహం చేసుకున్నాడు.. బానోతు రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చందన ఓ ఆభరణాల దుకాణంలో వర్కర్ గా పనిచేస్తుంది. వీరిద్దరూ బంజారా హిల్స్ ఇందిరానగరలోని అపార్ట్మెంట్లో ఉంటున్నారు. చిన్న విషయంలో ప్రాణాలు తీసుకుంది చందన. ఈ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది