Viral News : అన్నం వండ‌లేద‌ని రూమ్‌మేట్‌ని కొట్టి చంపేశారా.. ఇదెక్క‌డి దారుణం ?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: April 8, 2024, 2:00 pm
  •  Viral News : అన్నం వండ‌లేద‌ని రూమ్‌మేట్‌ని కొట్టి చంపేశారా.. ఇదెక్క‌డి దారుణం ?

Viral News : మనుషుల‌లో మాన‌వ‌త్వం చ‌చ్చిపోతుంది. ఒక‌రిపై ఒక‌రు ప‌గ‌, ప్ర‌తికారాలు పెంచుకుంటున్నారు. చిన్న చిన్న విష‌యాల‌కి చంపుకునేంత వ‌ర‌కు పోతున్నారు. క్షణికా ఆవేశమో, ఇతర కారణాలో తెలియదు కానీ.. ఈ తరం మనుషుల్లో మానవత్వం మ‌చ్చుకైన క‌న‌ప‌డ‌క‌పోవ‌డం బాధాకరం. భార్య భ‌ర్త‌లు, అన్న‌ద‌మ్ములు, అక్కా చెల్లెళ్లు, ఫ్రెండ్స్ ఇలా చాలా మంది మ‌ధ్య ప్రేమ‌, ఆప్యాయ‌త‌లు కొర‌వ‌డుతున్నాయి. అయితే తాజాగా ఓ వ్య‌క్తి టైంకి అన్నం వండ‌లేద‌నే కార‌ణంతో స్నేహితులు అత‌డిని చంపిన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో చోటు చేసుకుంది. చిన్న కార‌ణంతో ఓ వ్య‌క్తిని చంప‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

Viral News : అన్నం వండ‌లేదని చంపేస్తారా..

వివ‌రాల‌లోకి వెళితే హైదరాబాద్ జీడీమెట్లలో అన్నం వండలేదనే కార‌ణంతో 38 ఏళ్ల వ్యక్తిని అతని స్నేహితులు కొట్టి చంపారు. మృతుడిని రాజస్థాన్ కు చెందిన హన్స్ రామ్ అని తెలుస్తుంది. అత‌ను గ‌తంలో కుత్భుల్లాపూర్‌లో అద్దెంట్లో ఉండేవాడు. అయితే మ‌ద్యానికి బాగా బానిసైన అత‌ను రోజూ తాగి వచ్చి భార్య‌ని హింసించేవాడు. అయితే ఆ బాధ‌ని భ‌రించ‌లేక ఆమె త‌న త‌ల్లి వ‌ద్దకు వెళ్లింది. ఇక భార్య వెళ్లిపోయిన క్ర‌మంలో హన్స్‌రామ్ ఇల్లు ఖాళీ చేసి స్నేహితుడు బినయ్ సింగ్ ఇంట్లో ఉంటున్నా డు. స్థానిక గ్రానైట్ వ్యాపారి వద్ద పనిచేస్తున్న బినయ్ సింగ్ తనతో పాటు జీడిమెట్లలో ఉండమని చెప్పడంతో కొద్ది రోజులుగా కలిసి ఉంటున్నారు.

Viral News : అన్నం వండ‌లేద‌ని రూమ్‌మేట్‌ని కొట్టి చంపేశారా.. ఇదెక్క‌డి దారుణం ?

Viral News : అన్నం వండ‌లేద‌ని రూమ్‌మేట్‌ని కొట్టి చంపేశారా.. ఇదెక్క‌డి దారుణం ?

ప‌ని ముగించుకొని ఇంటికి తిరిగి వ‌చ్చిన స్నేహితులు వచ్చే స‌రికి అన్నం ఎందుకు వండ‌లేదంటూ బిన‌య్ సింగ్‌పై దాడి చేశారు. హ‌న్స్‌రామ్ ని చావ‌బాదారు. ఈ క్ర‌మంలో అత‌ను మ‌ర‌ణించాడు కూడా. అయితే నిందితులు వ‌చ్చేసి బీహార్ కు చెందిన సోనూ తివారీ, ఉత్తరప్రదేశ్ కు చెందిన సందీప్ కుమార్ అని తెలుస్తుంది. వారు అతని సహోద్యోగులుగా పోలీసులు గుర్తించారు.. ఈ ఘటన తర్వాత బినయ్ సింగ్ తన యజమానికి సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితులు దాడి తర్వాత అక్క‌డి నుండి పారిపోయారు. అయితే తాజా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  2. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  3. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  4. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  5. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  6. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

  7. "Dasara Special Buses : దసరా ప్రయాణికులకు ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా 5,261 స్పెషల్ బస్సులు, ఛార్జీల పెంపు ఉందా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp