Crime News : హయత్ నగర్ లో దారుణం.. భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో భార్య.. భర్తకు ఈ విషయం తెలియడంతో ఏం చేసిందంటే?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 30, 2022, 8:30 am

Crime News : ఈరోజుల్లో ఎవ్వరినీ నమ్మలేం. మన చుట్టూ ఉన్న వాళ్లే మనల్ని మోసం చేస్తుంటారు. అసలు ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. తాజాగా హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పెళ్లయినా.. భర్త ఉన్నా కూడా వేరే యువకుడితో సంబంధం పెట్టుకున్న మహిళ పరిస్థితి చివరకు ఏమైందో చూద్దాం రండి.

wife kills husband for lover in hyderabad

wife kills husband for lover in hyderabad

హయత్ నగర్ లో ఉంటున్న ఇద్దరు భార్యాభర్తలు ఆర్టీసీ ఉద్యోగులే. ఇద్దరూ కండక్టర్లే. అయితే.. వీళ్లలో భర్త ఒక డిపోలో కండక్టర్ కాగా… భార్య మరో డిపోలో కండక్టర్. దీంతో ఇద్దరి డ్యూటీలు వేరు అవడమే అతడి భార్యకు కలిసివచ్చింది. తన డిపోలోనే పని చేస్తున్న ఓ వ్యక్తితో అతడి భార్య సంబంధం పెట్టుకుంది. తన భర్త డ్యూటీకి వెళ్లగానే.. తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకునేది. ఆ తర్వాత తిరిగి తన భర్త డ్యూటీ నుంచి దిగి వచ్చే సమయానికి అతడు వెళ్లిపోయేవాడు. ఇలా.. భర్త లేని సమయంలో వేరే వ్యక్తి రావడం గమనించిన పక్కింటి వాళ్లు తన భర్తకు ఫిర్యాదు చేశారు. దీంతో తన పద్ధతి మార్చుకోవాలంటూ భార్యను మందలించాడు భర్త. కానీ.. అతడి మాట వినలేదు.

Crime News : భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్

దీంతో తన భర్త అడ్డు తొలగించుకుంటే జీవితాంతం తన ప్రియుడితో ఉండొచ్చని అనుకుంది ఆమె. దీంతో తన ప్రియుడి స్నేహితులతో తన భర్తపై దాడి చేయించింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. చివరకు మంచానికే పరిమితం అయిపోయాడు. అయితే.. మూడు నెలల పాటు బెడ్ మీదే ఉన్న తన భర్త.. చివరకు గుండె పోటుతో మృతి చెందాడు. పైగా తన భర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది సదరు భార్య. కట్ చేస్తే తన భర్త అడ్డు తొలగిందని అనుకొని తన ప్రియుడితో విచ్చలవిడిగా తిరుగుతోంది ఆమె. ఇంతలో తన భర్తపై దాడి చేసిన విషయాన్ని పొరపాటున తన ఫ్రెండ్ తో షేర్ చేసుకుంది. ఆ విషయం చివరకు తన భర్త సోదరుడి చెవిలో పడింది. దీంతో వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడి భార్య ప్రియుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో అంతా తామే చేశామని ఒప్పుకున్నాడు. అతడి ఫ్రెండ్స్ ను కూడా అరెస్ట్ చేశారు. అయితే.. ఈ విషయం తెలియగానే అతడి భార్య మాత్రం పరారీలో ఉంది. తన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp