Inspirational Story : మీరు మూన్ లైటింగ్ అనే పదాన్ని విన్నారా ఎప్పుడైనా. నిజానికి ఇది సాఫ్ట్ వేర్ రంగంలో బాగా వినిపిస్తుంది. మూన్ లైటింగ్ అంటే ఒకేసారి ఎక్కువ కంపెనీలకు పని చేసి ఎక్కువ డబ్బు సంపాదించడం. అంటే ఒక కంపెనీకి తెలియకుండా మరో కంపెనీకి పని చేయడం అన్నమాట. మూన్ లైటింగ్ అనేది ఒక్క ఐటీ ఇండస్ట్రీలోనే కాదు.. చాలా ఇండస్ట్రీల్లో ఉంది. నిజానికి ఇదేమీ నెగెటివ్ పదం కాదు. చాలామంది చాలా రంగాల్లో ఎక్కువ డబ్బు సంపాదించడానికి.. ఇల్లు గడవడానికి ఇలాంటి పద్ధతులను ఎంచుకుంటారు. అయితే..
తాజాగా ఒడిశాకు చెందిన ఓ లెక్చరర్ కూడా పూట గడవడం కోసం రెండు పనులు చేస్తున్నారు. ఉదయం కాగానే ఆయన లెక్చరర్ గా విద్యార్థులకు పాఠాలు చెబుతాడు. రాత్రి కాగానే రెడ్ కలర్ చొక్కా వేసుకొని రైల్వే స్టేషన్ కు వెళ్లి కూలీగా అవతారం ఎత్తుతాడు. అసలు.. కూలీ పని చేయడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అందులోనూ లెక్చరర్ అయి ఉండి కూడా ఏమాత్రం చిన్నతనంగా, నామూషీగా ఫీల్ అవకుండా ఆయన చేసిన పని చూసి అందరూ హేట్సాఫ్ అంటున్నారు. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన నగేశ్.. ప్రస్తుతం బరంపుర రైల్వే స్టేషన్ లో కూలీగా పని చేస్తున్నాడు.
నిజానికి నగేష్.. ఎంఏ చేశాడు. అందుకే విద్యార్థుల కోసం ఉచితంగా ఒక కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశాడు. ఆ కోచింగ్ సెంటర్ నిర్వహణ కోసం రాత్రిపూట కూలీగా పని చేస్తాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కోచింగ్ సెంటర్ లో ఉండి విద్యార్థులకు పాఠాలు చెబుతాడు. అందరూ నిరుపేద విద్యార్థులే ఆయన కోచింగ్ సెంటర్ కు వచ్చి పాఠాలు నేర్చుకుంటారు. దీంతో వాళ్ల దగ్గరి నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకోడు నగేష్. కేవలం కోచింగ్ సెంటర్ నిర్వహణ కోసం, అక్కడ టీచర్లకు జీతాలు ఇవ్వడం కోసం రాత్రి పూట మొత్తం కూలీగా పనిచేస్తాడు. ఇతడి గురించి తెలుసుకున్న స్థానికులు మాత్రం ఇతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
Banana Papaya : కొందరికి ఆహారపు అలవాట్లు వరకు నచ్చినట్లుగా వినియోగించుకుంటారు. అలాంటి అలవాటే బొప్పాయ, అరటిపండు. ఈ రెండిటిని…
Mahakumbh Mela 2025 : భూమిపై అతిపెద్ద సమావేశంగా జరుపుకునే 45 రోజుల మహాకుంభమేళా Mahakumbh Mela 2025 సోమవారం…
Supreme Court : భారత సుప్రీంకోర్టు (SCI) లా క్లర్క్-కమ్-రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల కోసం 90 ఖాళీలను భర్తీ చేయడానికి…
Daku maharaaj : సంక్రాంతి బరిలో బాలయ్య మూవీ ఉంటే..బాక్సాఫీస్ దగ్గర కనిపించే ఆ కిక్కే వేరు. గత ఏడాది…
Bhogi Festival : sankranti పండుగ వస్తుందనగానే సతీమణులందరూ ఇంటిని శుభ్రం చేసే పనిని పెట్టుకుంటారు. ఈ సమయంలో ఇంట్లో…
Bhogi : ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు పండగ అయిన సంక్రాంతి sankranti , భోగి Bhogi , కనుమ Kanuma …
Sankranthi Mugulu : సంక్రాంతి పండగ Sankrathi అంటే ముగ్గుల పండగ. ఈ పండగ వచ్చిందంటే అందరూ కూడా సంతోషంగా…
Sankranti Bhogi Ratham Muggu : సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముగ్గులతో ఇల్లు కళకళలాడిపోతూ ఉంటాయి. పురాతన కాలంలో గీతల…
This website uses cookies.