Inspirational Story : ఉదయం లెక్చరర్.. రాత్రి అయితే రైల్వే స్టేషన్ లో కూలీ.. ఇతడి స్టోరీ తెలిస్తే కన్నీళ్లు ఆగవు
Inspirational Story : మీరు మూన్ లైటింగ్ అనే పదాన్ని విన్నారా ఎప్పుడైనా. నిజానికి ఇది సాఫ్ట్ వేర్ రంగంలో బాగా వినిపిస్తుంది. మూన్ లైటింగ్ అంటే ఒకేసారి ఎక్కువ కంపెనీలకు పని చేసి ఎక్కువ డబ్బు సంపాదించడం. అంటే ఒక కంపెనీకి తెలియకుండా మరో కంపెనీకి పని చేయడం అన్నమాట. మూన్ లైటింగ్ అనేది ఒక్క ఐటీ ఇండస్ట్రీలోనే కాదు.. చాలా ఇండస్ట్రీల్లో ఉంది. నిజానికి ఇదేమీ నెగెటివ్ పదం కాదు. చాలామంది చాలా రంగాల్లో ఎక్కువ డబ్బు సంపాదించడానికి.. ఇల్లు గడవడానికి ఇలాంటి పద్ధతులను ఎంచుకుంటారు. అయితే..
తాజాగా ఒడిశాకు చెందిన ఓ లెక్చరర్ కూడా పూట గడవడం కోసం రెండు పనులు చేస్తున్నారు. ఉదయం కాగానే ఆయన లెక్చరర్ గా విద్యార్థులకు పాఠాలు చెబుతాడు. రాత్రి కాగానే రెడ్ కలర్ చొక్కా వేసుకొని రైల్వే స్టేషన్ కు వెళ్లి కూలీగా అవతారం ఎత్తుతాడు. అసలు.. కూలీ పని చేయడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అందులోనూ లెక్చరర్ అయి ఉండి కూడా ఏమాత్రం చిన్నతనంగా, నామూషీగా ఫీల్ అవకుండా ఆయన చేసిన పని చూసి అందరూ హేట్సాఫ్ అంటున్నారు. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన నగేశ్.. ప్రస్తుతం బరంపుర రైల్వే స్టేషన్ లో కూలీగా పని చేస్తున్నాడు.
Inspirational Story : కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఉచితంగా పిల్లలకు క్లాసులు చెబుతున్న నగేష్
నిజానికి నగేష్.. ఎంఏ చేశాడు. అందుకే విద్యార్థుల కోసం ఉచితంగా ఒక కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశాడు. ఆ కోచింగ్ సెంటర్ నిర్వహణ కోసం రాత్రిపూట కూలీగా పని చేస్తాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కోచింగ్ సెంటర్ లో ఉండి విద్యార్థులకు పాఠాలు చెబుతాడు. అందరూ నిరుపేద విద్యార్థులే ఆయన కోచింగ్ సెంటర్ కు వచ్చి పాఠాలు నేర్చుకుంటారు. దీంతో వాళ్ల దగ్గరి నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకోడు నగేష్. కేవలం కోచింగ్ సెంటర్ నిర్వహణ కోసం, అక్కడ టీచర్లకు జీతాలు ఇవ్వడం కోసం రాత్రి పూట మొత్తం కూలీగా పనిచేస్తాడు. ఇతడి గురించి తెలుసుకున్న స్థానికులు మాత్రం ఇతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.