Watchman TO Millionaire : ఒక సింపుల్ ఐడియాతో కోటీశ్వరుడు అయినా వాచ్ మెన్.. ఇది కదా అసలైన విజయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Watchman TO Millionaire : ఒక సింపుల్ ఐడియాతో కోటీశ్వరుడు అయినా వాచ్ మెన్.. ఇది కదా అసలైన విజయం..!

Watchman TO Millionaire : కష్టపడే తత్వం ఉండాలి కానీ ఎంతటి వారైనా కోటీశ్వరులు అవుతారు అనేది ఇందుకు నిదర్శనం. బీహార్ కి చెందిన దిగ్విజయ్ పాండే 18 ఏళ్ళ వయసులో ముంబైకి వచ్చాడు. తల్లిదండ్రులకు పెద్దగా ఆస్తులు లేకపోవడంతో అతను పెద్దగా చదువుకోలేదు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న దిగ్విజయ్ పదివేల రూపాయలతో ముంబైకి వచ్చాడు. పని కోసం వెతికాడు కానీ చివరికి తనకు ఏ పని నచ్చక పోవడంతో కొన్నాళ్ళు ఖాళీగా ఉన్నాడు. తను తెచ్చుకున్న […]

 Authored By aruna | The Telugu News | Updated on :13 December 2023,5:00 pm

Watchman TO Millionaire : కష్టపడే తత్వం ఉండాలి కానీ ఎంతటి వారైనా కోటీశ్వరులు అవుతారు అనేది ఇందుకు నిదర్శనం. బీహార్ కి చెందిన దిగ్విజయ్ పాండే 18 ఏళ్ళ వయసులో ముంబైకి వచ్చాడు. తల్లిదండ్రులకు పెద్దగా ఆస్తులు లేకపోవడంతో అతను పెద్దగా చదువుకోలేదు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న దిగ్విజయ్ పదివేల రూపాయలతో ముంబైకి వచ్చాడు. పని కోసం వెతికాడు కానీ చివరికి తనకు ఏ పని నచ్చక పోవడంతో కొన్నాళ్ళు ఖాళీగా ఉన్నాడు. తను తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో ఏదో ఒక పని చేయాలని ధనవంతుల ఇంటి ముందు వాచ్మెన్ గా చేరాడు. ఆ సమయంలో ముంబైకి వరదలు వచ్చాయి. ఓనర్ మంచి వాడు కావడంతో దిగ్విజయ్ కి భోజనం పెట్టేవాడు. ఆ ఇంటి ఓనర్ పిల్లలతో సహా అందరూ ఇంగ్లీషులో మాట్లాడేవారు. దిగ్విజయ్ కూడా తనకు వచ్చిన ఇంగ్లీష్ ను మాట్లాడేవాడు. అప్పుడే తనకు ముంబైలో బ్రతకాలంటే ఇంగ్లీష్ రావాలి అనే విషయం అర్థమైంది.

రోజు ఇంగ్లీష్ పేపర్ చదివి నేర్చుకునేవాడు. ఇంగ్లీషు పూర్తిగా మాట్లాడడం వచ్చాక వాచ్మెన్ ఉద్యోగం వదిలేసి పేపర్లో వచ్చిన ప్రకటన చూసి మారుతి కార్ షోరూమ్ లో సేల్స్ మాన్ ఉద్యోగం పొందాడు. ఇంటర్వ్యూ ఇంగ్లీషులో కానీ అతడికి డిగ్రీ లేదు. అయిన డిగ్రీ చదివానని చెప్పాడు. తనకున్న మాటకరితనంతో ఇంగ్లీషులో మాట్లాడి ఇంటర్వ్యూలో పాస్ అయ్యాడు. సర్టిఫికెట్స్ అడిగితే ముంబై వరదల్లో కొట్టుకొని పోయాయని, తనకు ఇంటికి వెళ్లి తెచ్చుకొని శక్తి లేదని, పేదవాడిని అని చెప్పాడు. రిక్వెస్ట్ చేసి జాబ్ కొట్టేసాడు. తర్వాత డిస్టెన్స్ లో డిగ్రీ పూర్తి చేసాడు. ఆ తర్వాత ఎంబీఏ కూడా పూర్తి చేశాడు. కార్ సేల్స్ లో ఏడేళ్ల ఎక్స్పీరియన్స్ పొందాడు. మంచి ప్రమోషన్ కూడా పొందాడు. ఆ తర్వాత పేపర్లో ప్రకటన చూసి బెంజ్ కార్ కంపెనీకి హెడ్ ఆఫీస్ లో జాబ్ పొందాడు. నెలకు రెండున్నర లక్షల ఉద్యోగం సంపాదించాడు.

ఇక 2020 తర్వాత యువకులంతా స్టార్ట్ అప్ యాప్ లు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. దీంతో దిగ్విజయ కూడా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నాడు. ప్రస్తుతం బిజీ లైఫ్ కారణంగా కూరగాయలను కట్ చేసుకోవడం పెద్ద పనిగా మారింది. దీన్నే దిగ్విజయ్ వ్యాపారంగా మార్చుకున్నాడు. ముందుగా తన ఫ్లాట్లోనే ఇద్దరు ఆడవాళ్లను పనిలో పెట్టుకొని కూరగాయలు కట్ చేపించి అమ్మేవాడు. వ్యాపారం బాగా సాగుతుండడంతో దానికి యాప్ ను కూడా డెవలప్ చేశాడు. కట్ చేసిన కూరగాయలను పండ్లను అమ్ముతూ బిజినెస్ 50 లక్షల టర్నో వర్ కి ఎదిగేలా చేశాడు. స్విగ్గి, జొమాటో కార్డ్స్ తో ఆన్లైన్లో అమ్మటం ప్రారంభించాడు. ఇక సంవత్సరం ఆదాయం రెండు కోట్లకు చేరింది. ప్రస్తుతం అతడి వ్యాపారం ఐదు కోట్లకు మారింది. ఇతర రాష్ట్రాలలో కూడా తన బిజినెస్ ని పెట్టాలని దిగ్విజయ్ అనుకుంటున్నాడు. ఇలా దిగ్విజయ్ వాచ్మెన్ ఉద్యోగం నుంచి కోట్లు సంపాదించే బిజినెస్ మాన్ గా మారాడు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది