Infosys : విద్యార్థులకు గుడ్ న్యూస్… ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుండి లక్ష రూపాయల స్కాలర్ షిప్… వెంటనే అప్లై చేసుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Infosys : విద్యార్థులకు గుడ్ న్యూస్… ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుండి లక్ష రూపాయల స్కాలర్ షిప్… వెంటనే అప్లై చేసుకోండి…!

Infosys  : ఇన్ఫోసిస్ అనేది దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మక సంస్థ మరియు ప్రపంచ ప్రసిద్ధి గాంచింది అని చెప్పొచ్చు. అయితే ఉద్యోగాల కల్పన లోనే కాక ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రజా సేవకు కూడా ఎంతో పేరుగాంచింది. అయితే ఈ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ విద్య మరియు ఆరోగ్య సంరక్షణ, మహిళ సాధికారత మరియు పర్యావరణ సుస్థిరత మరియు దేశంలోనే మహిళల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుంది. ఈ సమస్యలకు సహాయపడిన సంస్థ 2024 -25 లో ప్రతిభావంతులు అయినటువంటి విద్యార్థులకు […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 August 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Infosys : విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుండి లక్ష రూపాయల స్కాలర్ షిప్... వెంటనే అప్లై చేసుకోండి...!

Infosys  : ఇన్ఫోసిస్ అనేది దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మక సంస్థ మరియు ప్రపంచ ప్రసిద్ధి గాంచింది అని చెప్పొచ్చు. అయితే ఉద్యోగాల కల్పన లోనే కాక ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రజా సేవకు కూడా ఎంతో పేరుగాంచింది. అయితే ఈ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ విద్య మరియు ఆరోగ్య సంరక్షణ, మహిళ సాధికారత మరియు పర్యావరణ సుస్థిరత మరియు దేశంలోనే మహిళల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుంది. ఈ సమస్యలకు సహాయపడిన సంస్థ 2024 -25 లో ప్రతిభావంతులు అయినటువంటి విద్యార్థులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ STEM స్టార్స్ స్కాలర్ షీప్ లను అందజేస్తున్నది. అయితే ఈ స్కాలర్ షీప్ లకు ఎవరు అర్హులు. ఎలా దరఖాస్తు చేయాలి. దీనికి కావలసిన పత్రాలు ఏమిటి. పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Infosys : సంస్థ పేరు :- ఇన్ఫోసిస్ ఫౌండేషన్

అర్హత మరియు షరతులు :
– 2024 -25 సంవత్సరానికి సైన్స్ మరియు టెక్నాలజీ లేక ఇంజనీరింగ్,మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో మొదటి ఏడాది ఇంజనీరింగ్ లేక డిప్లమా తరగతులు చదువుతున్నటువంటి మహిళ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
– మీరు కచ్చితంగా భారతీయ పౌరులయ్యి ఉండాలి.
– చివరి ఏడాది పరీక్షలలో అద్భుతమైన మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు..
– విద్యార్థి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి 8 లక్షలు మించకూడదు.
– ఎన్ఐఆర్ఎఫ్ లాంటి గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూట్ లో ప్రవేశం పొందాలి.
– స్కాలర్ షిప్ ను పొందే అభ్యర్థి తరచూ నమోదు కలిగి ఉండాలి మరియు కోర్సు పూర్తి అయ్యేవరకు కూడా అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించాలి.

Infosys విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుండి లక్ష రూపాయల స్కాలర్ షిప్ వెంటనే అప్లై చేసుకోండి

Infosys : విద్యార్థులకు గుడ్ న్యూస్… ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుండి లక్ష రూపాయల స్కాలర్ షిప్… వెంటనే అప్లై చేసుకోండి…!

సహాయం అందుబాటులో ఉంది

– దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థికి లక్ష రూపాయల వరకు స్కాలర్ షీప్ అనేది వస్తుంది.
– ఇవి ఆమెకు ట్యూషన్ ఫీజు కట్టడానికి మరియు మెటీరియల్స్ కొనుక్కోవడానికి సహాయపడతాయి.
– నిధుల కొరత కారణం వలన ప్రతిభావంతులు అయినటువంటి బాలికలు విద్యకు ఎంతో దూరం అవుతున్నారు లేక వారు ఐచ్చిక సబ్జెక్టులను వదిలేస్తున్నారు..

దరఖాస్తు విధానం

• ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
https://www.buddy4study.com/page/infosys-stem-stars-scholarship#single ScApply పై క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

అవసరమైన పత్రాలు

– ఆధార్ కార్డు లేక ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏదైనా గుర్తింపు కార్డు.
– ఇంటర్ సంబంధించిన మార్కుల జాబితా.
-JEE/NEET /CET మార్కు షీట్ల తో సర్టిఫికెట్లను పాస్ చేయాలి.
– కళాశాల ప్రవేశ ఫీజు యొక్క రసీదు లేక కళాశాల ఐడి కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్లు.
– కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం.
– బీపీఎల్ రేషన్ కార్డు.
– పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.
– బ్యాంకు ఖాతా యొక్క వివరాలు మరియు ఇతర ముఖ్యమైన పత్రాలు.

ముఖ్యమైన తేదీలు :
ప్రారంభ తేదీ : ప్రస్తుతం మొదలుపెట్టారు.
చివరి తేదీ : సెప్టెంబర్ 15, 2025..

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది