Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. జీతం నెలకు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
ప్రధానాంశాలు:
Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. జీతం నెలకు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ (WIHG) అర్హత గల భారతీయ పౌరుల నుండి రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. జీతం నెలకు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
Recruitment 2026 : ఉద్యోగ వివరాలు..ఖాళీలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 04 రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
సంస్థ పేరు: వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ (WIHG)
పోస్ట్ పేర్లు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్
రిక్రూట్‌మెంట్ విధానం: రెగ్యులర్ బేసిస్
పోస్టుల సంఖ్య: 04
ఉద్యోగ స్థలం: డెహ్రాడూన్
నెల జీతం: రూ. ₹35,400/- నుండి ₹1,12,400/- వరకు
ఈ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో పాటు, స్థిరమైన ఉద్యోగ భద్రతతో మంచి జీతభత్యాలు అందిస్తాయి.
Recruitment 2026 : అర్హతలు, వయస్సు ..జీతం వివరాలు
విద్యా అర్హతలు:
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ డిగ్రీ ఉండాలి. కేంద్ర ప్రభుత్వ విభాగం/స్వయంప్రతిపత్తి సంస్థ/పబ్లిక్ సెక్టార్‌లో కనీసం 10 సంవత్సరాల అనుభవం అవసరం. ఇందులో కనీసం 3 సంవత్సరాలు తదుపరి దిగువ గ్రేడ్‌లో పని చేసి ఉండాలి.
అసిస్టెంట్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. ప్రభుత్వ లేదా శాస్త్రీయ సంస్థలో LDC/UDCగా 8 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్‌తో పాటు పే లెవల్–4 లేదా సమానమైన స్థాయిలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
Recruitment 2026 : వయోపరిమితి:
01.01.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి గరిష్టంగా 35 సంవత్సరాల లోపు ఉండాలి. (ప్రభుత్వ నియమాల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి)
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. ₹35,400/- నుండి ₹1,12,400/- వరకు వేతనం చెల్లించబడుతుంది.
దరఖాస్తు విధానం, ఫీజు .. ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు www.wihg.res.in
/ www.wing.res.in
వెబ్‌సైట్‌లో ఇచ్చిన లింక్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఇతర పద్ధతుల్లో పంపిన దరఖాస్తులు స్వీకరించబడవు.
దరఖాస్తు ఫీజు:
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – రూ. 1000/-
అసిస్టెంట్ – రూ. 500/-
(జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యుఎస్ అభ్యర్థులకు)
SC/ST/PH, మాజీ సైనికులు, వితంతువులు, విడాకులు తీసుకున్న లేదా న్యాయపరంగా విడిపోయిన మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
Recruitment 2026 : ఎంపిక విధానం:
దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను నైపుణ్య పరీక్ష లేదా వ్యక్తిగత ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితా సంస్థ వెబ్‌సైట్‌లో ప్రచురిస్తారు. ఇంటర్వ్యూ తేదీల మార్పుకు అవకాశం ఉండదు.
Recruitment 2026 : ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 26 జనవరి 2026 ఉదయం 10:00 గంటల నుండి
దరఖాస్తు.. ఫీజు చెల్లింపు చివరి తేదీ: 25 ఫిబ్రవరి 2026 సాయంత్రం 17:00 గంటల వరకు
కేంద్ర ప్రభుత్వంలో మంచి భవిష్యత్తు కోరుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.