NRDRM : ఏపీ గ్రామీణాభివృద్ధిశాఖలో 6881 ఉద్యోగాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

NRDRM : ఏపీ గ్రామీణాభివృద్ధిశాఖలో 6881 ఉద్యోగాలు

 Authored By prabhas | The Telugu News | Updated on :7 February 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  NRDRM : ఏపీ గ్రామీణాభివృద్ధిశాఖలో 6881 ఉద్యోగాలు

NRDRM : నేషనల్ రూరల్ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీక్రియేషన్‌ మిషన్‌ (NRDRM) – మినిస్ట్రీ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) భారీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 6,881 పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమైంది. ఫిబ్రవరి 24వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

NRDRM ఏపీ గ్రామీణాభివృద్ధిశాఖలో 6881 ఉద్యోగాలు

NRDRM : ఏపీ గ్రామీణాభివృద్ధిశాఖలో 6881 ఉద్యోగాలు

NRDRM  మొత్తం పోస్టులు – 6,881

డిస్ట్రిక్ట్‌ ప్రాజెక్టు ఆఫీసర్ : 93
అకౌంట్‌ ఆఫీసర్ : 140
టెక్నికల్ అసిస్టెంట్ : 198
డేటా మేనేజర్ : 383
ఎంఐఎస్‌ మేనేజర్ : 626
ఎంఐఎస్‌ అసిస్టెంట్ : 930
మల్టీ టాస్కింగ్ అఫిషియల్ : 862
కంప్యూటర్‌ ఆపరేటర్ : 1290
ఫీల్డ్‌ కోఆర్డినేటర్ : 1256
ఫెసిలిటేటర్స్ : 1103

అర్హత :

పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీలో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి :

ప్రాజెక్టు ఆఫీసర్‌ పోస్టులకు 23- 43 ఏళ్ల మధ్య, అకౌంట్ ఆఫీసర్‌ పోస్టులకు 22- 43 ఏళ్ల మధ్య, టెక్నికల్ అసిస్టెంట్‌, డేటా మేనేజర్‌, ఎంఐఎస్‌ మేనేజర్‌ పోస్టులకు 21- 43 ఏళ్ల మధ్య, మిగతా పోస్టులకు 18- 43 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం :

నెలకు డిస్ట్రిక్ట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ పోస్టులకు రూ.36,769, అకౌంట్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.27,450, టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.30,750, డేటా మేనేజర్‌ పోస్టులకు రూ.28,350, ఎంఐఎస్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.25,650, ఎంఐఎస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.24,650, మల్టీ టాస్కింగ్ అఫిషియల్‌ పోస్టులకు రూ.23,450, కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు రూ.23,250, ఫీల్డ్‌ కోఆర్డినేటర్‌ పోస్టులకు రూ.23,250, ఫెసిలిటేటర్స్‌కు రూ.22,750 ఉంటుంది.

ఎంపిక విధానం :

రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ :

ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.399 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.299 ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది