Government Jobs : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేశారా ?
ప్రధానాంశాలు:
Government Jobs : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేశారా ?
Government Jobs : పలు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు, సంస్థలు ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటిలో ఈ వారం దరఖాస్తు చేసుకోవాల్సినవి నోటిఫికేషన్స్ ఏవో చూద్దాం.
Government Jobs SSC కానిస్టేబుల్(జీడీ)
అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఏపీఎఫ్ వంటి రక్షణ దళాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. SSC అధికారిక పోర్టల్ ను సందర్శించి అక్టోబర్ 14లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 39,000 పైగా ఖాళీలు భర్తీ కానున్నాయి.
ఎస్‌బీఐ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 1,497 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభించింది. IT సిస్టమ్స్ డొమైన్‌లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ కింద అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అక్టోబర్ 4న దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు ఎస్‌బీఐ పోర్టల్ విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు.
ఇండియ న్ ఆర్మీ : ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఉన్నవారు అధికారిక పోర్టల్ jointerritorialarmy.gov.in విజిట్ చేసి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆఫ్‌లైన్‌లో అప్లై సెప్టెంబర్ 27లోపు అప్లికేషన్ ఫారమ్‌ను పంపాలి. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 10 ఖాళీలు భర్తీ కానున్నాయి.
NTPC : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ntpc.co.in విజిట్ చేసి సెప్టెంబర్ 28లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎలక్ట్రికల్, సివిల్ కన్‌స్ట్రక్షన్, మెకానికల్, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి విభాగాల్లో మొత్తంగా 250 ఖాళీలను సంస్థ భర్తీ చేయనుంది. అభ్యర్థుల వయసు 40 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం రూ. 70,000 నుంచి రూ.2,00,000 మధ్య ఉంటుంది.
ఐటీఐ అప్రెంటిస్‌షిప్ : ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (IGCAR), ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రిజిస్ట్రేషన్ గడువు అక్టోబర్ 13న ముగుస్తుంది. మెరిట్ ఆధారంగా 198 మందిని ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది.
నార్త్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్‌షిప్ : నార్త్ సెంట్రల్ రైల్వే-ప్రయాగరాజ్‌లో అప్రెంటిస్‌షిప్ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఐటీఐ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు అక్టోబర్ 15న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 1,679 ఖాళీలు భర్తీ కానున్నాయి.