Ap Intermediate 2025 : ఇంటర్ విద్యార్థులకి గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్.. తత్కాల్ పథకం మీ కోసమే..!
ప్రధానాంశాలు:
Ap Intermediate 2025 : ఇంటర్ విద్యార్థులకి గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్.. తత్కాల్ పథకం మీ కోసమే..!
Ap Intermediate 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులు 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువు మరోమారు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన జారీ చేసింది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు బోర్డు అధికారులు తెలిపారు. తత్కాల్ పథకం కింద ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించామని, డిసెంబరు 24 నుంచి 31 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికాశుక్లా తెలిపారు.
Ap Intermediate 2025 గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్..
గతంలో ఫీజు చెల్లించలేకపోయిన వారు అపరాధ రుసుముతో కలిపి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు విడివిడిగా రూ.3 వేల చొప్పున చెల్లించాలని ఆమె సూచించారు. పరీక్ష ఫీజుకు సంబంధించి భవిష్యత్తులో ఇక ఎలాంటి పొడిగింపు ఉండదని, ఇదే చివరి అవకాశమని ఆమె స్పష్టం చేశారు.మరోవైపు ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు, మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి
ఇంటర్ (జనరల్, ఒకేషనల్) ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు, ప్రైవేట్ (ఫెయిలైన) విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు చొరవ తీసుకుని విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. 2023-24 ఏడాదిలో 93 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈసారి ఒకటి, రెండు కేంద్రాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 188 కళాశాలల నుంచి 82,899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం నుంచి 42,228, ద్వితీయ సంవత్సరం నుంచి 40,671 మంది ఉన్నారు.