Jobs : ప‌దో త‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్ పాస్ అయితే చాలు.. రూ.20వేల‌కి పైగా జాబ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jobs : ప‌దో త‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్ పాస్ అయితే చాలు.. రూ.20వేల‌కి పైగా జాబ్

 Authored By ramu | The Telugu News | Updated on :28 December 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Jobs : ప‌దో త‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్ పాస్ అయితే చాలు.. రూ.20వేల‌కి పైగా జాబ్

Jobs : ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గతి లేదా ఇంట‌ర్ పాస్ అయితే చాలు వారికి మంచి ఉద్యోగం ద‌క్కే ఛాన్స్. తాజాగా డీహెచ్ఎం నుండి 14 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఫిజిషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్ఓ, సానిటరీ అటెండర్, ఫార్మసిస్ట్ మరియు టీబీహెల్త్ విజిటర్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు 30-12-2024 వరకు దరఖాస్తు చేసుకోవ‌లసి ఉంటుంది. ఇక వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుంది. పోస్టుల పేర్లు ఫిజిషియన్ / మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, ఎఫ్ఎన్ఓ, సానిటరీ అటెండర్ కం వాచ్ మెన్, ఫార్మసిస్ట్, టీబీహెల్త్ విజిటర్.

Jobs ప‌దో త‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్ పాస్ అయితే చాలు రూ20వేల‌కి పైగా జాబ్

Jobs : ప‌దో త‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్ పాస్ అయితే చాలు.. రూ.20వేల‌కి పైగా జాబ్

Jobs జీతం ఎంతంటే..

మొత్తం ఖాళీలు కాగా, పోస్టింగ్ కి ఎంపికైన వారు వైఎస్ఆర్ కడప జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్హ‌త‌గా తెలియ‌జేసారు. అప్లికేషన్ ఫీజు..జనరల్ అభ్యర్థులు – 500/-, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడ‌బ్ల్యూడీ – 200/- .వయస్సు18 నుండి 42 సంవత్సరాలు (సడలింపు వర్తించును). ఇక అప్లికేష‌న్ ఎక్క‌డ అంద‌జేయాలి అంటే డీఎంహెచ్ఓ, వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి అప్లై చేయండి. ఈ ఉద్యోగాల ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహించబడదు. అభ్యర్థుల ఎంపిక మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుంది. అప్లికేషన్ తేదీలు చూస్తే.. అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: 21-12-2024 కాగా, అప్లై చేయడానికి చివరి తేదీ: 30-12-2024.

నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 14 పోస్ట్‌లు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఫిజిషియ‌న్ మెడిక‌ల్ ఆఫీస‌ర్..1 పోస్ట్, ల్యాబ్ టెక్నీషియ‌న్ గ్రేస్ 2 పోస్ట్‌లు 3. ఎఫ్ఎన్ ఓ 5 పోస్ట్‌లు, సానిట‌రీ అటెండ‌ర్ కం వాచ్‌మెన్ 4 పోస్ట్‌లు, ఫార్మ‌సిస్ట్ 1 పోస్ట్‌, టీబీ హెల్త్ విజిట‌ర్ 1 పోస్ట్‌గా ఉంటుంద‌ని అన్నారు. ఇక జీతం విష‌యానికి వ‌స్తే ఫిజిషియ‌న్- 110000, మెడిక‌ల్ ఆఫీస‌ర్ 61000, ల్యాబ్ టెక్నీషియ‌న్ గ్రేడ్ 2 పోస్ట్‌లు 32670, ఎఫ్ఎన్ఓ-15000, సానిట‌రీ అటెండ‌ర్ కం వాచ్‌మెన్ -15000, ఫార్మసిస్ట్ -23393, టీబీ హెల్త్ విజిట‌ర్ -25526.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది