BSF Recruitment: BSF లో హెడ్ కానిస్టేబుల్ జాబ్స్..!!
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 2025 సంవత్సరానికి సంబంధించి పెద్ద ఎత్తున నియామక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 1121 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించగా, వీటిలో 910 రేడియో ఆపరేటర్ (RO), 211 రేడియో మెకానిక్ (RM) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు 10వ తరగతి, 12వ తరగతి మరియు ITI అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 24, 2025 నుంచి ప్రారంభమై, సెప్టెంబర్ 23, 2025 వరకు కొనసాగనుంది. వివరాలు BSF అధికారిక వెబ్‌సైట్ [bsf.gov.in](http://bsf.gov.in) లో అందుబాటులో ఉన్నాయి.

bsf head constable recruitment 2025
అర్హతల విషయానికి వస్తే.. హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) పోస్టులకు అభ్యర్థులు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం (PCM) ప్రధాన సబ్జెక్టులుగా 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి లేదా ITI కోర్సుతో పాటు 12వ తరగతి ఉత్తీర్ణులు కావాలి. రేడియో మెకానిక్ విభాగంలో, కనీసం 10వ తరగతి పాటు ITI పూర్తి చేసినవారు లేదా PCM సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, PET, PST, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షల ద్వారా జరగనుంది.
ఇక BSFలో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ నియామకాలు కూడా ప్రారంభమయ్యాయి. కాబ్లర్, టైలర్, కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, పమ్ ఆపరేటర్, అప్హోల్స్టర్, వాషర్‌మన్, బార్బర్, స్వీపర్, ఖోజీ/సైస్ వంటి విభాగాల్లో మొత్తం 3,588 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల కోసం 18–25 ఏళ్ల మధ్య వయస్సు గల పురుషులు, మహిళలు అర్హులు. ITI లేదా వృత్తి విద్యా సర్టిఫికెట్లు కలిగి ఉండటం అవసరమైన ట్రేడ్స్ కూడా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 25, 2025 వరకు కొనసాగుతుంది. కావున, ఆసక్తి గల అభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవడం అత్యంత ముఖ్యం.