Dragon Fruit : పిల్లలకు డ్రాగన్ ఫ్రూట్ పెట్టడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి…??
Dragon Fruit : పిల్లలు ఆరోగ్యంగా మరియు బలంగా ఉండటం కోసం పోషకాహారం అనేది ఖచ్చితంగా ముఖ్యం. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన ఎటువంటి రోగాలు కూడా తొందరగా ఎటాక్ చేయకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే పిల్లలకు తల్లి పాలు పట్టడం మానేసిన దగ్గర నుండి పండ్లను మరియు కూరగాయలను కచ్చితంగా అందించాలి. అప్పుడే వారు ఎంతో పుష్టిగా ఉంటారు. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా ఎంతో బలపడుతుంది. త్వరగా నిరసించి పోకుండా మరియు […]
ప్రధానాంశాలు:
Dragon Fruit : పిల్లలకు డ్రాగన్ ఫ్రూట్ పెట్టడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి...??
Dragon Fruit : పిల్లలు ఆరోగ్యంగా మరియు బలంగా ఉండటం కోసం పోషకాహారం అనేది ఖచ్చితంగా ముఖ్యం. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన ఎటువంటి రోగాలు కూడా తొందరగా ఎటాక్ చేయకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే పిల్లలకు తల్లి పాలు పట్టడం మానేసిన దగ్గర నుండి పండ్లను మరియు కూరగాయలను కచ్చితంగా అందించాలి. అప్పుడే వారు ఎంతో పుష్టిగా ఉంటారు. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా ఎంతో బలపడుతుంది. త్వరగా నిరసించి పోకుండా మరియు రోగాల బారిన పడకుండా కూడా ఉంటారు. అలాగే మీరు పిల్లలకు పెట్టే ఆహారంలో డ్రాగన్ ఫ్రూట్ ను కూడా చేర్చవచ్చు. దీనిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ఎంతోమంది డ్రాగన్ ఫ్రూట్ ను తీసుకుంటున్నారు. మరీ పిల్లలకు ఈ డ్రాగన్ ఫ్రూట్ ను పెట్టవచ్చా. పెడితే ఎటువంటి లాభాలు ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ సి మెండుగా : డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. దీనిలో విటమిన్ సి అధికంగా ఉండటం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది : డ్రాగన్ ఫ్రూట్ ను తీసుకోవడం వలన మన శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది ఎంతో బలంగా మారుతుంది. అలాగే దీనిలో ఉన్న విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలకు విటమిన్ సి అనేది చాలా అవసరం. ఈ విటమిన్ సి అనేది రోగాలు తొందరగా ఎటాక్ చేయకుండా చూస్తుంది.
జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది : ఈ డ్రాగన్ ఫ్రూట్ లో ఫ్రీ బయోటిక్ ఫైబర్ అనేది ఉంటుంది. ఇది ఎంతో ప్రయోజనకరమైన గట్ యొక్క బ్యాక్టీరియా పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. అలాగే ఎంతో ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు కూడా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో ఉండే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ : ఈ డ్రాగన్ ఫ్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది పిల్లల్లో ఉండే హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడటంలో కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. అలాగే మొత్తం ఆరోగ్యానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది.
స్కిన్ అలర్జీలను తగ్గిస్తుంది : పిల్లలకు డ్రాగన్ ఫ్రూట్ పెట్టడం వలన పిల్లలలో వచ్చే చర్మ అలర్జీలను కూడా తగ్గిస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల చర్మానికి ఎంతో రక్షణగా ఉంటాయి.