DRDO Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త… ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ DRDO ఉద్యోగాలు…!
ప్రధానాంశాలు:
DRDO Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త... ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ DRDO ఉద్యోగాలు...!
DRDO Jobs : ప్రస్తుత కాలంలో ఉద్యోగం లభించడం అనేది చాలా కష్టతరంగా మారింది. ప్రతి సంవత్సరం డిగ్రీ పట్టా పొంది బయటకు వచ్చే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంటే ఉద్యోగాలు మాత్రం వేలలో కనిపిస్తున్నాయి. దీంతో చాలామందికి జాబ్ దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని కష్టపడుతున్నారు. దీనికి గల ముఖ్య కారణం ప్రభుత్వ ఉద్యోగమైతే ఉద్యోగ భద్రత అలాగే సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయని అందరి భావన. అందుకోసమే చాలామంది ఏళ్ల తరబడి గవర్నమెంట్ జాబులకు ప్రిపేర్ అవుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో రాత పరీక్షలు లేకుండా కూడా కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రాత పరీక్ష లేకుండా దాదాపు రూ.40,000 సంపాదించగలిగే అవకాశం నిరుద్యోగులకు లభించింది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్నటువంటి యువతకు తాజాగా కేంద్ర ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన సంస్థలలో ఒకటైనటువంటి డిఫెన్స్ రిసెర్స్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO ) లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
DRDO Jobs నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నుండి విడుదల కావడం జరిగింది.
DRDO Jobs ఖాళీలు
ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా డిఆర్డిఓలో ఖాళీగా ఉన్నటువంటి 12 జూనియర్ రీసెర్చ్ ఫేలో పోస్టులను భర్తీ చేయనున్నారు.
DRDO Jobs విద్యార్హత…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ స్థాయిలో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించాలి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ మరియు కంప్యూటర్ ఇంజనీరింగ్ లో ఎంఈ లేదా ఎంటెక్ విద్యార్హత కలిగి ఉండాలి.
DRDO Jobs వయోపరిమితి…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారు గరిష్టంగా 28 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,ST లకు 5 సంవత్సరాలు , OBCలకు 3 సంవత్సరాల వయసుసడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం…
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : June 19 2024.
జూన్ 19 – 20 తేదీలలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు జరుగుతాయి.
దరఖాస్తు చేయు విధానం…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదుచేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.