Ration Card : ఆధార్, రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ration Card : ఆధార్, రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్

 Authored By ramu | The Telugu News | Updated on :30 March 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Ration Card : ఆధార్, రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్

Ration Card : విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో జిఎంఆర్ నైరేడ్ స్వయం ఉపాధి సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచితంగా ఉపాధి శిక్షణ అందిస్తోంది. జిఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ మరియు యూనియన్ బ్యాంకు సహకారంతో నడుస్తున్న ఈ సంస్థ 2003 జనవరిలో స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 21,000 మందికి పైగా ఉచిత శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలను కల్పించింది. ఈ సంస్థ ద్వారా విద్యార్హత, వయస్సు, ఆసక్తికి తగిన వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి, జాబ్ అవకాశాలు కల్పించబడతాయి. ప్రత్యేకంగా 10వ తరగతి పాసైన నిరుద్యోగ యువతకు ఇది ఉత్తమమైన అవకాశంగా చెప్పవచ్చు.

Ration Card ఆధార్ రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్

Ration Card : ఆధార్, రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్

Ration Card ఉచితంగా వసతి, భోజనం, శిక్షణ & ఉద్యోగం

ఈ నైరేడ్ సంస్థ ద్వారా శిక్షణ పొందే అభ్యర్థులకు ఉచిత వసతి, ఉచిత భోజనం, యూనిఫాం (T-షర్ట్) మరియు టూల్ కిట్స్ కూడా అందజేస్తారు. శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థులకు సర్టిఫికేట్ అందించడంతో పాటు, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కూడా చర్యలు తీసుకుంటారు. ప్రతి నెల 25వ తేదీన అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసినవారికి శిక్షణ అందిస్తారు. ముఖ్యంగా హోమ్ నర్సింగ్ కోర్సు పూర్తి చేసినవారికి రూ. 15,000 జీతంతో ఉద్యోగ భరోసా కూడా ఇస్తున్నారు.

Ration Card శిక్షణ పొందవచ్చిన కోర్సులు & అర్హతలు

ప్రస్తుతం ఈ సంస్థలో రెఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్ (75 రోజులు), ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ (60 రోజులు), మొబైల్ ఫోన్ సర్వీసింగ్ (30 రోజులు), లేడీస్ టైలరింగ్ (30 రోజులు), హోమ్ నర్సింగ్ (30 రోజులు), కంప్యూటర్ DTP (45 రోజులు) వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 19 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలి. మరిన్ని వివరాల కోసం 9989953145, 9959951325, 9491741129, 8374886306 నంబర్లను సంప్రదించవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది