JOB : మీరు 7 వ తరగతి చదివితే చాలు..రూ.30 వేల జీతం వచ్చే జాబ్ మీ సొంతం
JOB : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలోని విజయనగరం జిల్లా న్యాయస్థానంలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. న్యాయ సేవల రంగంలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 68 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో ముఖ్యంగా 30 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు కేవలం ఏడో తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. జీతం అలవెన్సులతో కలిపి రూ.30,000కు పైగా ఉంటుంది. వయో పరిమితి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఇతర పోస్టుల్లో స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, కాపీయిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎక్జామినర్, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్ ఉన్నాయి. ఒక్కో పోస్టుకు తగిన విద్యార్హతలు తప్పనిసరిగా ఉండాలి. ఉదాహరణకు టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, కాపీయిస్ట్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీతో పాటు టైపింగ్ నైపుణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ తప్పనిసరి. డ్రైవర్ పోస్టులకు ఏడో తరగతి పాస్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అభ్యర్థులు https://aphc.gov.in వెబ్‌సైట్ ద్వారా జూన్ 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

JOB : మీరు 7 వ తరగతి చదివితే చాలు..రూ.30 వేల జీతం వచ్చే జాబ్ మీ సొంతం
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల నుంచి జెనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారు రూ.800 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల వర్గానికి రూ.400 మాత్రమే ఫీజు ఉంటుంది. సొంత జిల్లాలోనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకునే ఇది మంచి అవకాశం. అందుకే అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ గడువు మించకముందే వెంటనే దరఖాస్తు చేసుకుని ఉద్యోగ అవకాశాన్ని వినియోగించుకోవాలి.