Job Mela : మిరాకిల్ కాలేజీలో మినీ జాబ్ మేళా.. జీతం రూ.3.50 ల‌క్ష‌లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Job Mela : మిరాకిల్ కాలేజీలో మినీ జాబ్ మేళా.. జీతం రూ.3.50 ల‌క్ష‌లు

Job Mela : యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదో తరగతి మొదలుకుని ఆపై చదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి అవకాశాలు కల్పిస్తుంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ కొన్ని వేల‌ మందికి […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 September 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Job Mela : మిరాకిల్ కాలేజీలో మినీ జాబ్ మేళా.. జీతం రూ.3.50 ల‌క్ష‌లు

Job Mela : యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదో తరగతి మొదలుకుని ఆపై చదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి అవకాశాలు కల్పిస్తుంది.

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ కొన్ని వేల‌ మందికి ప్ర‌భుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఇందులో భాగంగానే నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం సమీపంలో గల మిరాకిల్ కళాశాలలో ఈ నెల 18న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వెల్ల‌డించారు. ఈ జాబ్ మేళాలో హెటెరో ఫార్మా, అపోలో ఫార్మా, శ్రీరామ్ గ్రూప్, డెక్కన్ కెమికల్, బొల్లినేని హోమ్ ఫ్రంట్, వరుణ్ మోటార్స్, మొత్తుట్ అరబిందో ఫార్మా పాల్గొంటున్న‌ట్లు తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఏదైనా పూర్తి చేసి, 18 నుంచి 30 ఏండ్ల లోపు వారు అర్హులు.

Job Mela మిరాకిల్ కాలేజీలో మినీ జాబ్ మేళా జీతం రూ350 ల‌క్ష‌లు

Job Mela : మిరాకిల్ కాలేజీలో మినీ జాబ్ మేళా.. జీతం రూ.3.50 ల‌క్ష‌లు

ఈ ఉద్యోగ మేళాలో ఎంపికైన వారికి జీతం రూ.10 వేల‌ నుంచి రూ.3.5 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. అభ్య‌ర్థులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్ పోర్టు సైజు ఫొటో తీసుకురావాలని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి క‌ల్ప‌నాధికారి కోరారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది