Job Mela in Hanumakonda : నిరుద్యోగులకు శుభవార్త.. హనుమకొండలో రేపు జాబ్ మేళా
ప్రధానాంశాలు:
Job Mela in Hanumakonda : నిరుద్యోగులకు శుభవార్త.. హనుమకొండలో రేపు జాబ్ మేళా
Job Mela in Hanumakonda : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఈ నెల 10న (గురువారం) జాబ్ మేళా నిర్వహించనుంది. ఈ మేరకు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం.మల్లయ్య వివరాలు వెల్లడించారు.
ఈ నెల 10న నిర్వహించే జాబ్ మేళాలో హైదరాబాద్‌కు చెందిన మహావీర్ ఫైనాన్షియల్ కంపెనీ పాల్గొననున్నట్లు చెప్పారు. కంపెనీలో ఖాళీగా ఉన్న టెలికాలర్స్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో కంపెనీ కేటాయించిన ప్రాంతాల్లో పని చేయాలన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఆపై చదివిన విద్యార్థులు అర్హలు అని తెలిపారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలన్నారు.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్స్, బయోడేటా, ఆధార్ కార్డ్, పాస్ ఫొటోలతో ఈ నెల 10న ఉదయం 11 గంటలకు వరంగల్ నగరంలోని ములుగు రోడ్డు ప్రాంతంలో ఉన్న జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయానికి రావాలన్నారు. వివరాలకు 7893394393 నంబర్ ను సంప్రదించవచ్చని తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.